విధాత : బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం ఆమె తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. గత కొంతకాలంగా విజయశాంతి బీజేపీకి రాజీనామా చేస్తారన్న చర్చ నడుస్తున్నది. కానీ.. ఆమె ఆ విషయంలో నిర్ణయాన్ని మాత్రం ప్రకటించలేదు. గతంలో ప్రధాని మోదీ సభకు కూడా ఆమె హాజరుకాలేదు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తున్నది.


బీజేపీకి రాజీనామా చేస్తానని విజయశాంతి నిన్నటి వరకూ ప్రకటించకపోయినా.. తన సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ పిక్ ను మార్చేశారు. పార్టీకి రాజీనామా చేయడానికి ఇదే సంకేతంగా పలువురు భావించారు. దానికి అనుగుణంగానే ఆమె బుధవారం రాజీనామా చేస్తూ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు.

TAAZ

TAAZ

Next Story