పారిశుద్ధ్య‌ కార్మికుల మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే

మృతదేహాల వద్ద నివాళులర్పించి.. త‌క్ష‌ణ సాయం అంద‌జేత‌ విధాత, మెదక్ బ్యూరో: శనివారం తెల్లవారుజామున పారిశుధ్య కార్మికులు కారు ప్రమాదంలో మృతి చెందగా ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఆసుపత్రి వద్ద నివాళులర్పించి, సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి ప్ర‌క‌టించారు. మున్సిపల్ లో విధులు నిర్వహించడానికి 5 గురు మహిళలు కాలినడకన వస్తుండగా రాందాస్ చౌరస్తా నుండి వేగంగా వస్తున్న ఆల్టో కారు పారిశుధ్య కార్మికులను ఢీ కొట్టడంతో దాయర వీధికి చెందిన నర్సమ్మ అక్కడికి […]

పారిశుద్ధ్య‌ కార్మికుల మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే
  • మృతదేహాల వద్ద నివాళులర్పించి.. త‌క్ష‌ణ సాయం అంద‌జేత‌

విధాత, మెదక్ బ్యూరో: శనివారం తెల్లవారుజామున పారిశుధ్య కార్మికులు కారు ప్రమాదంలో మృతి చెందగా ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి ఆసుపత్రి వద్ద నివాళులర్పించి, సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి ప్ర‌క‌టించారు.

మున్సిపల్ లో విధులు నిర్వహించడానికి 5 గురు మహిళలు కాలినడకన వస్తుండగా రాందాస్ చౌరస్తా నుండి వేగంగా వస్తున్న ఆల్టో కారు పారిశుధ్య కార్మికులను ఢీ కొట్టడంతో దాయర వీధికి చెందిన నర్సమ్మ అక్కడికి అక్కడే మృతి చెందింది. చికిత్స పొందుతూ యాదమ్మ అనే మహిళ మృతి చెందింది. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

విషయం తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ గవర్నమెంట్ మార్చురీకి చేరుకొని పార్థివదేహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి అన్నివేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు.

చికిత్స పొందుతున్న మరియమ్మను పరామర్శించి మెరుగైన వైద్యం అందించమని హాస్పిటల్ డాక్టర్ చంద్రశేఖర్ కు సూచించారు. మరో ఇద్దరిని శాంతమ్మ, జయమ్మ మెరుగైన చికిత్స కోసం గాంధీ హాస్పిటల్ పంపించడం జరిగిందన్నారు. తక్షణ సాయం కింద మృతి చెందిన ఇద్దరు కుటుంబాలకు రూ.10000 చొప్పున రూ.20,000 అందజేశారు.

అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబాలకు వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు, వారి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్, వారి కుటుంబంలో చనిపోయిన వారి కింద‌ ఉద్యోగ అవకాశం ఇస్తామని అన్నారు. ఎమ్మెల్యే వెంట జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు ఆర్కే శ్రీనివాస్, కిషోర్, వసంత్, జయరాజ్, రాజలింగం, పట్టణ పార్టీ అధ్యక్షులు యం.గంగాధర్, కో ఆప్షన్ నెంబర్ సయ్యద్ ఉమర్ మొహియొద్దీన్, నాయకులు రాగి అశోక్, కృష్ణ గౌడ్,ప్రవీణ్ గౌడ్ సుమన్ శివరామకృష్ణ, మధు సాదిక్ అలీ, అమీర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.