‘హాత్ సే హాత్ జోడో’లో మహిళలు ముందుండాలి: సునీతారావు
విధాత: హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా మహిళా కాంగ్రెస్ హత్ సే హత్ జోడో పాదయాత్ర కార్యక్రమంపై శుక్రవారం ఆమె సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మాధవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సునీత రావు మాట్లాడుతూ AICC మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు […]

విధాత: హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా మహిళా కాంగ్రెస్ హత్ సే హత్ జోడో పాదయాత్ర కార్యక్రమంపై శుక్రవారం ఆమె సమీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు మాధవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సునీత రావు మాట్లాడుతూ AICC మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దిగ్విజయంగా కొనసాగిందన్నారు.
గడప గడపకు రాహుల్ గాంధీ సందేశం..
ఈ యాత్రకు కొనసాగింపుగా AICC అధ్యక్షుడు శ్రీ మల్లిఖార్జున్ ఖర్గే ఆదేశాల మేరకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారన్నారు. జోడో పాదయాత్రలలో మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గడప గడపకు రాహుల్ గాంధీ సందేశం తీసుకెళ్లి, కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బిఆర్ఎస్ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా కోరారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా ఇన్‌చార్జ్ కోఆర్డినేటర్ నీలం పద్మ భాగ్య, మన్మధ, సుజాత, స్వరాజ్యలక్ష్మి, బుజ్జిభాయ పద్మ, సుజాత, నారాయణమ్మ, జిల్లా కమిటీ సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, పట్టణ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.