Baby | ఈ ‘బేబీ’కి ఏం కనెక్ట్ అవుతున్నారబ్బా.. బాక్సాఫీస్‌కి పిచ్చెక్కిస్తోంది
Baby | భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు, పాన్ వరల్డ్ సినిమాల రేంజ్ నడుస్తున్న తరుణంలో ఓ చిన్న సినిమా అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. అసలు చిన్న బడ్జెట్ సినిమాలకు చోటు లేని కాలంలో ఈ చిత్రం కంటెంట్ పరంగా విజయాన్ని అందుకుంది. ఈమధ్య కాలంలో విడుదలైన ‘బేబీ’ మూవీనే అది. ‘బేబీ’ మూవీకి క్రేజ్ కూడా ఓ లెవల్లో వచ్చింది. చిన్న బడ్జెట్ సినిమాలకు ఆదరణ తగ్గిపోయిన కాలంలో మళ్ళీ వెనక్కు […]

Baby |
భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు, పాన్ వరల్డ్ సినిమాల రేంజ్ నడుస్తున్న తరుణంలో ఓ చిన్న సినిమా అందరి చూపులను తనవైపు తిప్పుకుంది. అసలు చిన్న బడ్జెట్ సినిమాలకు చోటు లేని కాలంలో ఈ చిత్రం కంటెంట్ పరంగా విజయాన్ని అందుకుంది. ఈమధ్య కాలంలో విడుదలైన ‘బేబీ’ మూవీనే అది. ‘బేబీ’ మూవీకి క్రేజ్ కూడా ఓ లెవల్లో వచ్చింది.
చిన్న బడ్జెట్ సినిమాలకు ఆదరణ తగ్గిపోయిన కాలంలో మళ్ళీ వెనక్కు వెళ్ళి 2000 సంవత్సరం నాటి చిన్న సినిమాని ఆదరించిన కాలాన్ని తీసుకువచ్చింది. ఈ సినిమా గురించి పెద్దగా ప్రచారం లేకపోయినా థియేటర్లో విడుదలైన మరుక్షణం ఈ కంటెంట్‌కి కనెక్ట్ అయింది యూత్. సినిమాకు సక్సెస్ తీసుకు వచ్చింది కూడా వాళ్లే. కాస్త వయసులో ఉండి ప్రేమ వలలో చిక్కుకునే ప్రతి వారినీ తాకే డెప్త్ ఉన్న సినిమాగా ‘బేబి’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
పాన్ ఇండియా అని భారీ బడ్జెట్‌తో వస్తున్న సినిమాలకు ధీటుగా.. కథ బలంగా ఉంటే చిన్న సినిమాకు కూడా మార్కెట్ ఉందని నిరూపించింది. కుర్రకారు జీవితాలతో ఆడుకున్న ప్రేమ హెచ్చుతగ్గులను దగ్గరగా చూపిస్తూ., ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న బాల్య ప్రేమలను గుర్తు చేస్తుందనో.., లేక మా గురించే తీశారని కనెక్ట్ అవుతున్నారో తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ థియేటర్‌కి ఈ సినిమా కోసం యూత్ ఎగబడుతోంది.
ఇక సినిమా కథ పరంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇలాంటి కాన్సెఫ్ట్‌తో ఎప్పుడో 90లో ప్రేమదేశం పేరుతో వచ్చిన సినిమా ప్రపంచాన్నే కుదిపేసింది. ఇక ‘బేబీ’ అయితే చివరికి వచ్చే సరికి ముగ్గురు మగవాళ్లను తన జీవితంలో చూస్తుంది ఆమె. ఇద్దరు యుక్త వయసు వాళ్ళు కలిసి స్నేహంగా ఉంటే పరిస్థితులు వారిని ఎలా దగ్గర చేస్తాయనే విషయాన్ని సినిమాలో చూపించారు.
స్కూల్ రోజుల్లో ఓ రకమైన ప్రేమ, స్నేహం.. కాలేజ్‌లో మరో స్నేహం, ప్రేమ ఇలా ఇద్దరిని తన జీవితంలోకి ప్రేమ పేరుతో రానిచ్చి, మరో వ్యక్తిని పెళ్ళాడుతుంది ‘బేబీ’. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని దర్శకుడు సాయి రాజేష్ యూత్‌కు కనెక్ట్ అయ్యేలా చూపించాడు.
ఇక ఇంటర్వెల్ సీన్ యూత్‌కు విపరీతంగా నచ్చింది. అమ్మాయిల చేతిలో మోసపోయిన వాళ్ళకు, ప్రేమను దక్కించుకోలేని కుర్రాళ్ళకు ఈ సినిమా అందుకే కనెక్ట్ అయిందేమో. ప్రేమలో అన్ని కోణాలను టచ్ చేసిన సినిమాగా బేబీ ఘన విజయం వైపు దూసుకుపోతుంది. దూసుకుపోవడం ఏమిటి.. ఆల్రెడీ దూసుకుపోయింది.