Manipur violence | మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగింపు.. సుప్రీంకోర్టు సీరియస్.. రంగంలోకి దిగుతామని హెచ్చరిక
Manipur విధాత: మణిపూర్‌లో చెలరేగిన అల్లర్ల మాటున మహిళలను వివస్త్రలుగా చేసి, నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 4వ తేదీన కాంగ్‌పోక్పి జిల్లాలో జరిగిన ఈ ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీడియో ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అమానవీయ ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించింది. ఈ […]

Manipur
విధాత: మణిపూర్‌లో చెలరేగిన అల్లర్ల మాటున మహిళలను వివస్త్రలుగా చేసి, నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 4వ తేదీన కాంగ్‌పోక్పి జిల్లాలో జరిగిన ఈ ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీడియో ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ అమానవీయ ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించింది. ఈ ఘటన తనను ఆందోళనకు గురి చేసింది, ఇలాంటి దాడులు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై కేంద్రం తగిన రీతిలో స్పందించకుంటే న్యాయస్థానమే చర్యలు చేపడుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుపాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు మణిపూర్ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. మహిళలపై హింస దృశ్యాలను సోషల్ మీడియాలో ప్రసారం చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని కోర్టు వ్యాఖ్యానించింది.
ట్విట్టర్‌పై కేంద్రం ఆగ్రహం..
మహిళలను వివస్త్రలుగా చేసి ఊరేగించిన వీడియో వైరల్ కావడంపై కేంద్రం మండి పడింది. శాంతి భద్రతలు, ఇతర కారణాల దృష్ట్యా ఈ వీడియోలను తక్షణమే తొలగించాలని ట్విట్టర్ సహా ఇతర సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ అమానవీయ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నందున సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ భారత చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని కేంద్రం పేర్కొంది. మరో వైపు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ట్విట్టర్‌పై కేంద్రం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
Tinubu will turn Nigerians to this if we don’t wake up now
Enough is Enough! #Manipur_Violence #Manipur #shameful #ManipurViolence #shameful Meitei #AllEyesOnTheJudiciary #Kukiwomen #Meitei #GlimpseofKanguva India Justice Ugo Wike Rufai Okwute INEC Judiciary PEPT Fuel Ellu P pic.twitter.com/0IgwiXdtjE
— Orchmoney16 (@Orchmoney161) July 20, 2023
అసలేం జరిగింది..?
మణిపూర్‌లో కొన్ని నెలల నుంచి రిజర్వేషన్లకు సంబంధించి రెండు తెగల మధ్య వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ రిజర్వేషన్ల వివాదం పలు ఉద్రిక్తత పరిస్థితులకు కూడా దారి తీసింది. మణిపూర్‌లో కుకి-జోమి వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను కొందరు నగ్నంగా తీసుకు వెళుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో బుధవారం వెలుగుచూసింది.
రెండు నెలల కిందట జరిగిన ఈ ఘటనలో మహిళలను నగ్నంగా ఊరేగించి ఆపై పలువురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్టు వెల్లడైంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మే 4న జరిగిందని, బాధితురాలిలో ఒకరు 19 ఏండ్ల యువతి అని పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితుడు హీరాదాస్(32)పై కిడ్నాప్, గ్యాంగ్‌రేప్, మర్డర్ కింద కేసు నమోదు చేశారు.