Mirnaa Menon | ‘జైలర్’ కోడలు చాలా హాట్ గురూ.. చూస్తే మతిపోవాల్సిందే!

Mirnaa Menon | ‘రోబో’ తర్వాత మళ్ళీ అంతకు మించిన విజయాన్ని ఇన్నేళ్ళకు అందుకున్నాడు రజనీకాంత్.. ఇప్పటివరకూ ఉన్న రికార్డుల్ని తిరగరాస్తూ.. రజనీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా ‘జైలర్’ దూసుకుపోతోంది. ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఒకే తెరమీద అగ్రతారలందరూ రజనీతో కలిసి కనిపించడం కూడా సినిమాకు హైలెట్‌గా నిలిచింది. రజనీ, మోహన్ లాల్, శివన్న, జాకీ ష్రాఫ్ లాంటి దిగ్గజాలంతా ఒకే […]

Mirnaa Menon | ‘జైలర్’ కోడలు చాలా హాట్ గురూ.. చూస్తే మతిపోవాల్సిందే!

Mirnaa Menon |

‘రోబో’ తర్వాత మళ్ళీ అంతకు మించిన విజయాన్ని ఇన్నేళ్ళకు అందుకున్నాడు రజనీకాంత్.. ఇప్పటివరకూ ఉన్న రికార్డుల్ని తిరగరాస్తూ.. రజనీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా ‘జైలర్’ దూసుకుపోతోంది. ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఒకే తెరమీద అగ్రతారలందరూ రజనీతో కలిసి కనిపించడం కూడా సినిమాకు హైలెట్‌గా నిలిచింది.

రజనీ, మోహన్ లాల్, శివన్న, జాకీ ష్రాఫ్ లాంటి దిగ్గజాలంతా ఒకే సినిమాలో కనిపించడం ‘జైలర్’ కథకు బలాన్నిచ్చాయి. ఇక అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టేసింది. ఈ మూవీలో నటించిన ప్రతి పాత్రకు ఎంతో కొంత గుర్తింపు ఉండేలా దర్శకుడు సినిమాని మలిచాడు. ఇందులో రజనీకాంత్ కోడలిగా నటించిన మిర్నా మీనన్ కొన్ని సీన్లలో మాత్రమే కనిపించినా ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఆమె ఎవరు? ఏమిటని కనుక్కునే పనిలో పడ్డారు అభిమానులు.

మిర్నా తెలుగు తెరమీద కూడా కనిపించింది. ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించింది కూడా. మిర్నా అసలు పేరు అదితి. సినిమాల్లోకి వచ్చాకా తన పేరును మిర్నా మీనన్‌గా మార్చుకుంది. వృత్తిపరంగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన మిర్నా 2016లో ‘పట్టదారి’ అనే మూవీతో సినిమాల వైపు వచ్చింది. ఈ మూవీ తర్వాత చేసిన సినిమాల్లో పెద్దగా గుర్తింపు పొందలేదు.

ఈ మధ్యే ఆమెకు గుర్తింపు లభించడంతో.. మిర్నాకు వరుస అవకాశాలు వరిస్తున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో బిగ్ బ్రదర్, ఆది సాయి కుమార్ తో ‘క్రేజీ ఫెలో’, అల్లరి నరేష్ తో ‘ఉగ్రం’ సినిమాలలో కనిపించింది. వీటి తర్వాత స్టెప్ ఏకంగా రజనీ సినిమా ‘జైలర్’లో అవకాశం రావడంతో చిన్న పాత్రే అయినా వెంటనే ఒప్పుకుంది. అయితే సినిమా హిట్ తర్వాత అభిమానుల వేటలో మిర్నా హాట్ లుక్స్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తన ఇన్‌స్టాగ్రమ్‌లో కనిపించిన కొన్ని ఫొటోలలో ఆమెను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

ఎందుకో తెలుసా? సూపర్ స్టార్ రజనీ కాంత్ కోడలిగా చేసింది ఈ అమ్మాయేనా అనేంతగా ఆ ఫొటోలలో మిర్నా ఉంది. మాములుగా అల్లరి నరేష్ సినిమా ‘ఉగ్రం’తోనే ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అందులో అల్లరి నరేష్‌కి ఇచ్చిన డీప్ లిక్‌లాక్ మాములుగా ఉండదు. ఆ సినిమాలో వేరే అతనితో తండ్రి పెళ్లి చేస్తే.. అల్లరి నరేష్ రాగానే.. మెడలో తాళి తీసేసి వెళ్లి అల్లరి నరేష్‌ లిప్ లాక్‌ ఇచ్చేస్తుంది. అలాంటి మిర్నాకు ‘జైలర్’ పంజాబీ డ్రస్ వేసి కూర్చునే పాత్రకే పరిమితం చేశారు.

ఆ పాత్రతో ఎక్కడ తన గ్లామర్ ఇమేజ్ డౌన్ అవుతుందని భావించిందో.. ఏమో గానీ.. కాస్త డోస్ పెంచి మరీ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను మిర్నా వదిలింది. ఈ ఫొటోలు చూసిన కుర్రకారుకి మతి పోతుందంటే.. ఏ రేంజ్‌లో ఆమె బ్యూటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆమె గురించి టాలీవుడ్, కోలీవుడ్‌లలో బాగానే సెర్చింగ్ జరుగుతోంది. అన్నీ బాగుంటే.. మరి కొన్ని సినిమాలలో ఆమె కనిపించే అవకాశం ఉందనే చెప్పుకోవాలి.