గోవాలో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలు
విధాత: కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. కీలక నేతలంతా వరుస పెట్టి పార్టీని వీడుతున్నారు. కొంతమంది బీజేపీలోకి వెళ్తుంటే.. మరికొంతమంది సొంత పార్టీ పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా గోవాలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం దిగంబర్ కామత్, ప్రతిపక్ష నేత మైఖైల్ లోబోలతో కలిసి మొత్తం 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ […]

విధాత: కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. కీలక నేతలంతా వరుస పెట్టి పార్టీని వీడుతున్నారు. కొంతమంది బీజేపీలోకి వెళ్తుంటే.. మరికొంతమంది సొంత పార్టీ పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
తాజాగా గోవాలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం దిగంబర్ కామత్, ప్రతిపక్ష నేత మైఖైల్ లోబోలతో కలిసి మొత్తం 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.
ఇటీవలే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభించగా అంతటా మంచి స్పందన వస్తుండడంతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ చేస్తున్న ఈ యాత్రతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అందరూ భావించారు.
నేతల నుంచి క్యాడర్ వరకూ ఈ యాత్ర జోష్ నింపుతుందని అధినాయకత్వం కూడా ఆశించింది. కానీ జోడో యాత్ర జరుగుతుండగానే కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
