నోట్ల రద్దుకి 5ఏండ్లు..!
విధాత: పాత కరెన్సీ నోట్లు రద్దు జరిగి నేటికి సరిగ్గా 5 ఏండ్లు. బీజేపీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన రెండేండ్లకు ప్రధాని మోడీ దేశంలోని నల్ల ధనాన్ని బయటకు తీసుకువస్తానని పాత నోట్లు రద్దు చేస్తే గుట్టలు గుట్టలుగా దాచుకున్న సొమ్మంతా బయటికి వస్తుందని, దేశంలో పేదరికం ఉండదని అందరికీ అభివృద్ది ఫలాలు అందుతాయని చెపి సరిగ్గా 5 ఏండ్ల క్రితం ఇదే రోజున నవంబర్ 8, 2016 న రాత్రికి రాత్రే కేంద్ర ప్రభుత్వం నోట్లను […]

విధాత: పాత కరెన్సీ నోట్లు రద్దు జరిగి నేటికి సరిగ్గా 5 ఏండ్లు. బీజేపీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన రెండేండ్లకు ప్రధాని మోడీ దేశంలోని నల్ల ధనాన్ని బయటకు తీసుకువస్తానని పాత నోట్లు రద్దు చేస్తే గుట్టలు గుట్టలుగా దాచుకున్న సొమ్మంతా బయటికి వస్తుందని, దేశంలో పేదరికం ఉండదని అందరికీ అభివృద్ది ఫలాలు అందుతాయని చెపి సరిగ్గా 5 ఏండ్ల క్రితం ఇదే రోజున నవంబర్ 8, 2016 న రాత్రికి రాత్రే కేంద్ర ప్రభుత్వం నోట్లను రద్దు చేసింది.
ఈ క్రమంలో కేంద్రం చెప్పిన సమాన అభివృద్ధి, నకిలీ కరెన్సీని నియంత్రణ, ఉగ్రవాదం నిర్మూళన జరుగకపోగా పైపెచ్చు ఇవేవి జరుగక దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలోకి వెళ్లింది. మొదట పీఎం నిర్ణయాన్ని సమర్ధించిన వారే రానురాను అది ఒక తుగ్లక్ చర్యగా అభివర్ణించారు. ఉన్నపళంగా జరిగిన నోట్ల రద్దు దేశ ప్రజల్లో ఇప్పటికీ ఒక పీడకలగానే ఉంది. ఆ సమయంలో సామాన్యులు పడ్డ కష్టాలు ఉహకందనివి.
దివ్యాంగులను, వృద్ధులను సైతం రోడ్డుపైకి తీసుకువచ్చి పడేసింది. రోజులు, నెలల తరబడి వారి కష్టాలు కొనపాగాయి. రోడ్లపై క్యూ లైన్లలో పడిగాపులు కాచి ప్రాణాలు సైతం కోల్పోయిన వారున్నారు. మరోవైపు ముందస్తు సమాచారం ఉన్న పెద్దలంతా జాగ్రత్త పడగా మరికొందరు తమ పలుకుబడులను, అధికారాలను ఉపయోగించుకుని తమ దగ్గర నిల్వ ఉన్న నగదును మార్చుకున్నారు. వారి ధనాన్ని మార్చుకొనుటలో బ్యాంకర్లు 30 శాతం ఛార్జీతో వారికి సహాయ పడ్డారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి.
ఇదిలాఉండగా సామాన్యులు నానతంటాలు పడుతుంటే కొందరు బీజేపీ నేతలు మాత్రం వారి ఇండ్లల్లో జరిగిన విందుల్లో రూ.2000 నోట్లను జల్లుతూ తందనాలు ఆడారు. ఇవన్నీ చూస్తూ కూడా కేంద్రం ఏమీ పట్టనట్టు వ్యవహరించింది. అంతేకాకుండా నోట్ల రద్దు జరిగిరన ఆతి స్వల్ప కాలంలోనే నకీలీ నోట్లు పుట్టుకు రావడంతో కేంద్రం నిర్ణయంపై తీవ్ర వ్యతిరేఖత ఏర్పడింది. నోట్ల రద్దు సమయానికి దేశంలో ఉన్న మొత్తం నగదు విలువ రూ.18 లక్షల కోట్లు. వీటిలో రద్దు అయిన పెద్ద నోట్లు రూ.1000, రూ.500 నోట్లు 85 శాతం. ఏదేమైనప్పటికీ నోట్ల రద్దు మూలంగా ఆర్థిక అసమానతలు పెరిగాయి. మహిళలు, రైతులు, కార్మికులతో పాటు అణగారిన వర్గాలకు ప్రతికూల ప్రభావాలను మిగిల్చిందని విశ్లేషకులు, నిపుణులు వెల్లడించారు.