అజిత్ దోవ‌ల్ తో భేటీ అయిన కెప్టెన్ అమ‌రీంద‌ర్

విధాత‌: పంజాబ్‌లో రాజ‌కీయ ప‌రిణామాలు ఆస‌క్తిక‌రంగా మారిన విష‌యం తెలిసిందే. అయితే ఢిల్లీ టూర్‌లో ఉన్న ఆ రాష్ట్ర మాజీ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ ఇవాళ నేష‌న‌ల్ సెక్యూర్టీ అడ్వైజ‌ర్ అజిత్ దోవ‌ల్‌తో భేటీ అయ్యారు. బుధ‌వారం రోజున కేంద్ర మంత్రి అమిత్ షాతోనూ అమ‌రీంద‌ర్ భేటీ అయ్యారు. దీంతో ఆయ‌న బీజేపీలో చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. నూత‌న రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేస్తున్న రైతుల గురించి కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు […]

అజిత్ దోవ‌ల్ తో భేటీ అయిన కెప్టెన్ అమ‌రీంద‌ర్

విధాత‌: పంజాబ్‌లో రాజ‌కీయ ప‌రిణామాలు ఆస‌క్తిక‌రంగా మారిన విష‌యం తెలిసిందే. అయితే ఢిల్లీ టూర్‌లో ఉన్న ఆ రాష్ట్ర మాజీ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ ఇవాళ నేష‌న‌ల్ సెక్యూర్టీ అడ్వైజ‌ర్ అజిత్ దోవ‌ల్‌తో భేటీ అయ్యారు. బుధ‌వారం రోజున కేంద్ర మంత్రి అమిత్ షాతోనూ అమ‌రీంద‌ర్ భేటీ అయ్యారు. దీంతో ఆయ‌న బీజేపీలో చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. నూత‌న రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేస్తున్న రైతుల గురించి కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు షాతో భేటీ అయిన‌ట్లు అమ‌రీంద‌ర్ త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు. మ‌రో వైపు కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌లు అంబికా సోనీ, క‌మ‌ల్‌నాథ్‌లు.. కెప్టెన్ అమ‌రీంద‌ర్‌ను క‌లిసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు మ‌రో 4 నెల‌ల్లో జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీని అమ‌రీంద‌ర్ సింగ్ వీడితే, ఆ పార్టీకి పంజాబ్‌లో క‌ష్టాలు ఎదుర‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఈనేప‌థ్యంలో కెప్టెన్ అమ‌రీంద‌ర్‌ను బుజ్జ‌గించేందుకు కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. కానీ అమ‌రీంద‌ర్ మాత్రం ఢిల్లీలో బీజేపీ పెద్ద‌ల్ని క‌ల‌వ‌డం పార్టీలో ఉత్కంఠ‌త రేపుతుంది.