ట్రాక్ట‌ర్ ర్యాలీకి రాహుల్ గాంధీ సంఘీభావం

విధాత,న్యూఢిల్లీ : వ్య‌వ‌సాయ చ‌ట్టాలకు వ్య‌తిరేకంగా రైతులు శ‌నివారం మ‌రో ట్రాక్ట‌ర్ ర్యాలీకి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో అన్న‌దాత‌ల‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంఘీభావం వ్య‌క్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన మూడు వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పోరుబాట ప‌ట్టిన రైతుల‌కు తాను వెన్నంటి ఉంటాన‌ని రాహుల్ ట్వీట్ చేశారు. స‌త్యాగ్ర‌హులుగా తాము ఈ దేశ రైతుల వెంట న‌డుస్తామ‌ని రాహుల్ స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దేశ రాజ‌ధాని స‌రిహ‌ద్దుల్లో […]

ట్రాక్ట‌ర్ ర్యాలీకి రాహుల్ గాంధీ సంఘీభావం

విధాత,న్యూఢిల్లీ : వ్య‌వ‌సాయ చ‌ట్టాలకు వ్య‌తిరేకంగా రైతులు శ‌నివారం మ‌రో ట్రాక్ట‌ర్ ర్యాలీకి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో అన్న‌దాత‌ల‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంఘీభావం వ్య‌క్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన మూడు వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పోరుబాట ప‌ట్టిన రైతుల‌కు తాను వెన్నంటి ఉంటాన‌ని రాహుల్ ట్వీట్ చేశారు.

స‌త్యాగ్ర‌హులుగా తాము ఈ దేశ రైతుల వెంట న‌డుస్తామ‌ని రాహుల్ స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా దేశ రాజ‌ధాని స‌రిహ‌ద్దుల్లో నిర‌స‌న‌లు ఏడు నెల‌ల‌కు చేర‌డంతో ఉద్య‌మాన్ని ఉధృతం చేసేందుకు రైతులు మ‌రోసారి ట్రాక్ట‌ర్ ర్యాలీ నిర్వ‌హించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. సిసౌలీలోని బీకేయూ కార్యాల‌యం నుంచి బ‌య‌లుదేరే ట్రాక్ట‌ర్ ర్యాలీ యూపీ గేట్ మీదుగా ఘ‌జియాబాద్ చేరుకునేలా రైతు సంఘాల నేత‌లు ప్ర‌ణాళిక‌లు రూపొందించారు.

ReadMore:అయోధ్య అభివృద్ధిపై ప్ర‌ధాని మోదీ స‌మీక్ష‌