ఈ రోజు థియేటర్‌లో ఏకంగా పది సినిమాలు విడుదల..ఏ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయంటే..!

దసరా, సంక్రాంతి, సమ్మర్‌లలో మాత్రమే స్టార్ హీరోలు ఎక్కువగా సందడి చేస్తుండడం మనం చూస్తున్నాం.మిగతా సమయాలలో చిన్న సినిమాలు, కంటెంట్ ఉన్న చిత్రాలు వచ్చి ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఎగ్జామ్ సీజన్ కావడంతో థియేటర్స్‌లో మీడియం సినిమాలు సందడికి సిద్ధమవుతున్నాయి. గత వారం గామి, ప్రేమలు చిత్రాలు థియేటర్స్‌లోకి వచ్చి ప్రేక్షకులకి మంచి వినోదం పంచాయి. ఇక ఈ రోజు శుక్రవారం కావడంతో సినీ ప్రియులు ఏ సినిమాకి వెళ్లాలి, ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయనే దానిపై ఓ లుక్ వేస్తున్నారు.
ఈ రోజు ఏకంగా 10 సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి. ముందుగా హీరో సాయిరామ్ శంకర్ చాలా గ్యాప్ తర్వాత ‘వెయ్ దరువెయ్’ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండగా, మార్చ్ 15న చిత్రం రిలీజ్ కానుంది. ఈ మూవీ ఎంటర్టైనర్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ తో రూపొందింది.చైతన్య రావు, భూమి శెట్టి జంటగా తెలంగాణ నేటివిటీతో తెరకెక్కిన ‘షరతులు వర్తిస్తాయి’ చిత్రం కూడా నేడే థియేటర్స్‌లోకి వస్తుంది. ఇక భారతదేశంలో నిజాం సంస్థానాన్ని కలిపిన కథాంశంతో రూపొందిన రజాకార్ అనే చిత్రం కూడా నేడు థియేటర్స్‌లో సందడి చేయనుంది. ఈ మూవీపై అభిమానులలో అంచనాలు భారీగానే ఉన్నాయి. అనన్య నాగళ్ళ లీడ్ రోల్‌లో తెరకెక్కిన హారర్ సినిమా ‘తంత్ర’ కూడా నేడే విడుదల కానుంది.
ఇక బిగ్ బాస్ ఫేమ్ దివి ప్రధాన పాత్రలో రూపొందిన లవ్ థ్రిల్లర్ స్టోరీ ‘లంబసింగి’ కూడా నేడే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. త్రిగున్ హీరోగా లైన్ మేన్స్ కష్టాలతో పాటు ఓ ఎమోషన్ తో తెరకెక్కిన ‘లైన్ మెన్’ సినిమా మార్చి15న రిలీజ్ అవుతుంది. ఎస్తర్ నోరాన్హా ‘మాయ’ సినిమా, ‘రవికుల రఘురామ’, ‘స్వామి నాగుల కొండ’.. అనే పలు చిన్న సినిమాలు కూడా నేడు థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ పది సినిమాలలో ప్రేక్షకులు ఎక్కువగా రజాకార్, లంబసింగి అనే చిత్రాలపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు మంచి హిట్ అయితాయని భావిస్తారు. మరి కొద్దిగంటలలో వీటి రిజల్ట్ ఏంటనేది తెలియనుంది. ఇక వీటితో పాటు ఓటీటీ కూడా చాలా చిత్రాలు కనువిందు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.