ఈ శుక్రవారం ఒక్క రోజే ఏకంగా 18 సినిమాలు విడుదల.. ఫ్యాన్స్‌కి పండగే..!

ఎలాంటి పండగలు, ప్రత్యేక సందర్భాలు లేనప్పుడే చాలా సినిమాలు ఓటీటీలలో విడుదల అవుతుండడం మనం చూస్తున్నాం. ఇక ఇప్పుడు దీవాళి సందర్భంగా అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీల్లో సినిమాల జాతర ఉండనున్నట్టు అర్ధమవుతుంది. ఈ సారి దీవాళికి టాలీవుడ్ నుండి పెద్ద సినిమాలేవి విడుదల కావడం లేదు కాని కొన్ని డబ్బింగ్ సినిమాలు మాత్రం తెలుగు ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమయ్యాయి. జపాన్, జిగర్ తాండ, టైగర్ 3 వంటి పెద్ద చిత్రాలు తెలుగు ప్రేక్షకులకి మంచి వినోదం పంచేందుకు సిద్ధమయ్యాయి. ఇక ఓటీటీ విషయానికి వస్తే మాత్రం బోలెడన్ని సినిమాలు ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు రెడీగా ఉన్నాయి.
కేవలం శుక్రవారం మాత్రమే దాదాపు 18 సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ కానుండగా వీటిలో పిప్పా, ద రోడ్, కన్నూర్ చిత్రాలతోపాటు.. మరిన్ని ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ లో దిన్ హసీమ్.. ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో, పిప్పా.. హిందీ సినిమా,పులిక్కుత్తు పండి.. తమిళ్ మూవీ.., హ్యాక్ క్రైమ్స్ ఆన్ లైన్.. హిందీ సిరీస్, BTS ఎట్ టూ కమ్.. కొరియన్ సినిమా, 007. రోడ్ టూ ఏ మిలియన్.. ఇంగ్లీష్ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విషయానికి వస్తే.. లేబుల్.. తెలుగు డబ్బింగ్ సిరీస్, కన్నూరు స్వ్కాడ్.. తెలుగు డబ్బింగ్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఆహాలో ద రోడ్.. తెలుగు డబ్బింగ్ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఇక జీ5లో ఘూమర్..హిందీ సినిమా, ఈ విన్..లో ద బాయ్స్ హాస్టల్.. తెలుగు డబ్బింగ్ సినిమా, లయన్స్ గేట్ ప్లేలో వాట్స్ లవ్ గాట్ టుడూ విత్ ఇట్.. ఇంగ్లీష్ సినిమా, బుక్ మై షో..లో ద అడల్ట్స్.. ఇంగ్లీష్ సినిమా, నెట్ ఫ్లిక్స్..లో ఫేమ్ ఆఫ్టర్ ఫేమ్.. స్పానిష్ సిరీస్, ద కిల్లర్.. ఇంగ్లీష్ సినిమా, ఎట్ ద మూమెంట్.. మాండరిన్ సిరీస్,ఆకుమా కున్.. జపనీస్ సిరీస్ వంటివి ప్రేక్షకులకి వినోదం పంచేందుకు రెడీ అయ్యాయి. ఇంకెందుకు ఆలస్యం శుక్రవారం ఈ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్‌గా ఎంజాయ్ చేయండి.