కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఏడుగురు మృతి

మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో ఘోరం జరిగింది. స్థానికంగా ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రాయ్‌గఢ్ జిల్లాలోని బ్లూ జెట్ హెల్త్ కేర్ కంపెనీలో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటన నిన్న రాత్రి జరిగిందని తెలిపారు. ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఈ మంటలు కెమికల్ బ్యారెల్స్‌కు అంటుకోవడంతో పేలుడు సంభవించిందని పేర్కొన్నారు.