ప్రైవేట్‌గా బ‌న్నీ వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్స్.. భార్య‌ని ముద్దుల‌తో ముంచెత్తాడుగా..!

ప్రైవేట్‌గా బ‌న్నీ వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్స్.. భార్య‌ని ముద్దుల‌తో ముంచెత్తాడుగా..!

పుష్ప చిత్రంతో నేష‌న‌ల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో నేష‌న‌ల్ అవార్డ్ కూడా అందుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప‌2తో బిజీగా ఉండ‌గా, ఈ సినిమాతో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాల‌ని చూస్తున్నాడు. ఇక బ‌న్నీ సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా త‌న ఫ్యామిలీకి మాత్రం త‌ప్ప‌క కేటాయిస్తుంటాడు. అయితే అల్లు అర్జున్ – స్నేహ రెడ్డిల 13వ వెడ్డింగ్ యానివర్సరీ మార్చి 6న కాగా, ఆ జంట‌కి స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. బ‌న్నీ త‌న సోష‌ల్ మీడియాలో పెళ్లి ఫొటో షేర్ చేస్తూ.. పెళ్లై 13ఏళ్లు అయ్యింది. నీ బంధం వ‌ల్ల‌నే నేను ఇలా ఉన్నాను. నీ ప్రశాంతమైన మనసు నుంచి నాకు ఎంతో శ‌క్తి ల‌భిస్తుంది.

మనం ఇలాంటి యానివ‌ర్సీరీలు ఎన్నో జ‌రుపుకోవాల‌ని కోరుకుంటున్నాను.. హ్యాపీ యానివర్సరీ క్యూటీ అంటూ బన్నీ పోస్ట్ పెట్టారు. ఇక ఈ జంట యానివ‌ర్సరీ సెల‌బ్రేష‌న్స్ ప్రైవేట్‌గా జ‌రుపుకున్న‌ట్టు తెలుస్తుంది. రాత్రి స్నేహ స్పెషల్ గా తమ ఇంట్లోనే అల్లు అర్జున్ పాటలతో స్పెషల్ మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయ‌గా, ఆ పాటలు వింటూ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసింది. చిన్న వీడియోని మాత్ర‌మే స్నేహా రెడ్డి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది. పార్టీలో అల్లు అర్జున్, స్నేహ, అయాన్, అర్హ.. ఇలా ఫ్యామిలీ అంతా కలిసి కేక్ కట్ చేసుకొని యానివ‌ర్స‌రీ ఈవెంట్‌ని స్పెష‌ల్‌గా సెల‌బ్రేట్ చేసుకున్నారు.

యానివ‌ర్స‌రీ పార్టీకి సంబంధించిన వీడియోల‌ని అల్లు అర్జున్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. వివాహ దినోత్స‌వాన్ని ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసిన స్నేహ‌కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు అల్లు అర్జున్. ప్ర‌స్తుతం బ‌న్నీ ఫ్యామిలీకి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక అల్లు అర్జున్- స్నేహా రెడ్డి ప్రేమ పెళ్లి విష‌యానికి వ‌స్తే..సమంత సామ్ జామ్ చాట్ షోలో ఓ సారి పాల్గొన్న బ‌న్నీ..స్నేహాని తొలిసారి నైట్ క్ల‌బ్‌లో చూసాన‌ని, అప్పుడే ఆమెకి ఫిదా అయ్యాన‌ని చెప్పాడు. నైట్ క్ల‌బ్‌లో స్నేహ చాలా డిగ్నిఫైడ్ గా క‌నిపించ‌డం, నాకు బాగా న‌చ్చింది అని అన్నాడు. మొత్తానికి 2011 మార్చి 6లో వారిరివురికి వివాహ జ‌ర‌గ‌గా, ఆ జంట‌కి అయాన్, అర్హ అనే ఇద్ద‌రు పిల్లలు జ‌న్మించారు.