డంకీ సినిమా పాట పాడిన అల్లు అయాన్.. ఫిదా అయి షాకింగ్ రియాక్ష‌న్ ఇచ్చిన షారూఖ్ ఖాన్

డంకీ సినిమా పాట పాడిన అల్లు అయాన్.. ఫిదా అయి షాకింగ్ రియాక్ష‌న్ ఇచ్చిన షారూఖ్ ఖాన్

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో అల్లు అర్జున్ ది ప్రత్యేకమైన స్థానం అని చెప్పాలి. న‌టుడిగా అల్లు రామ‌లింగ‌య్య ఎంత మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు అందుకున్నారో ఇప్పుడు ఆయ‌న మ‌న‌వ‌డు అల్లు అర్జున్ అంత‌కు మించి అన్న‌ట్టుగా దూసుకుపోతున్నాడు. పుష్ప సినిమాతో ఏకంగా నేష‌న‌ల్ అవార్డ్ కూడా అందుకున్నాడు. ఇప్పుడు పుష్ప2 సినిమాతో ఆస్కార్ అందుకోవ‌డం ఖాయం అని కొంద‌రు జోస్యం చెబుతున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్ర‌మే కాదు త‌న పిల్ల‌లు కూడా ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటేలా క‌నిపిస్తున్నారు. అల్లు అర్జున్ కూతురు అర్హ సమంతతో కలిసి శాకుంతలం సినిమాలో నటించింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ కూడా తెచ్చుకుంది.

ఇక బ‌న్నీ త‌న‌యుడు అయాన్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడ‌ని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తుండ‌గా తాజాగా అయాన్ ఎంట్రీకి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. పుష్ప‌2లో అయాన్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించి ఓ ప్ర‌క‌ట‌న కూడా చేయ‌నున్నార‌ని స‌మాచారం. అయితే అర్హ‌తో పోల్చుకుంటే అయాన్ సోష‌ల్ మీడియాలో అంత‌గా క‌నిపించ‌డు. ఎక్కువ‌గా అర్హ‌కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. అయితే తాజాగా అయాన్ పాట పాడుతున్న వీడియో ఒకటి నెట్టింట వైర‌ల్‌గా మారింది. షారుఖ్ న‌టించిన‌ ఎమోషనల్ డ్రామా మూవీ ‘డంకీ’. ఆ సినిమాలో ‘లుటు పుటు గయా’ అనే సాంగ్ అయాన్ అద్భుతంగా ఆలపించాడు.

త‌న అల్ల‌రిలో భాగంగా అయాన్ పాడిన పాట‌కి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. అయాన్ లో ఈ యాంగిల్ కూడా చూసిన నెటిజెన్స్, అభిమానులు.. ‘మోడల్ అయాన్ బొల్తే’ అంటూ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక అయాన్ సాంగ్‌కి బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కూడా ఫిదా అయ్యారు. థ్యాంక్యూ లిటిల్ వన్.. నీవు పాడిన పాటలో ప్లవర్, ఫైర్ రెండు చూయించావని, నేను కూడా నా పిల్లలకు పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను నేర్పిస్తా అంటూ స్ట‌న్నింగ్ రిప్లై ఇచ్చాడు. ఇక షారూఖ్ రిప్లైకి ఫిదా అయిన అల్లు అర్జున్.. షారుఖ్ జీ సో స్వీట్ ఆఫ్ యూ.. మీ హంబుల్ మెసేజ్ కి ధన్యవాదాలు అంటూ స‌మాధానం ఇచ్చాడు. ప్ర‌స్తుతం బ‌న్నీ పోస్ట్ కూడా తెగ వైర‌ల్ అవుతుంది.