వామ్మో.. బాయ్‌ఫ్రెండ్‌తో అమలాపాల్ ఆ ముద్దు, ముచ్చట్లు ఏంది..మరికొన్ని ఫొటోలు ఔట్

మలయాళీ ముద్దుగుమ్మ అమలాపాల్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. సినిమాలతో కన్నా ఎక్కువగా అందచందాలతో హాట్ టాపిక్ అవుతుంది. ఇద్దరమ్మాయిలతో.. టాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చినప్పటికీ అనుకున్నంత స్టార్ డమ్ మాత్రం రాకపోవడంతో తమిళం సినిమాలలో చేసింది. అక్కడే తమిళ్ యంగ్ డైరెక్టర్ను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ… అంతలోనే విడాకులు తీసుకున్నారు.. డివోర్స్ తర్వాత అమలా పాల్ ఆ తరువాత ఓ పంజాబీ సింగర్‌తో ప్రేమలో ఉందని.. ఇద్దరికి పెళ్లై పోయిందంటూ ప్రచారం జరగగా, దానిని అమలాపాల్ ఖండించింది.
అయితే అమలాపాల్ కెరీర్ వైవిధ్యంగా కొనసాగిస్తోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న అమలాపాల్ ఇటీవల తన రెండో పెళ్లి విషయంలో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతుంది. రీసెంట్ గా రెండో పెళ్లికి సిద్ధమైనట్టు ప్రకటించింది. తన ప్రియుడు జగత్ దేశాయ్ ని పరిచయం చేస్తూ వేలికి ఉంగరాన్ని ధరించి తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టింది. ప్రియుడితో కలిసి ఫొటోలకు రొమాంటిక్ గా ఇచ్చిన ఫోజులని పంచుకుంది. కాబోయే భర్తతో కలిసి అమలాపాల్ చేసిన రచ్చ చూసి ప్రతి ఒక్కరు నోరెళ్లపెట్టారు.
ఇక తాజాగా ప్రియుడిని ముద్దుల్లో ముంచేసిన మరికొన్ని ఫొటోస్ నూ షేర్ చేసి షాకిచ్చింది.. లిప్ లాక్ చేస్తూ.. ప్రియుడి కౌగిలో బంధి అయిన పిక్స్ ను పంచుకుంటూ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. ‘జీవితకాలం కలిసి ఉండాలనే జరిగిన పార్టీ నుంచి.. మా ప్రేమ కథను తెలియజేస్తున్నాను’. అంటూ అమలాపాల్ రాసుకొచ్చింది. ఇక మలయాళీ అయిన అమలా పాల్ మాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలే చేసింది . ఆ తర్వాత ‘బెజవాడ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా, ఆ తర్వాత వరుసగా లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండా పై కపిరాజు ఇలా పలు సినిమాలు చేసింది . అయితే కెరీర్ మంచి పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అమలా పాల్ … డైరెక్టర్ ఎఎల్ విజయ్‌ని అమలా పాల్ పెళ్లి చేసుకొని మనస్పర్ధల వలన 2017లో విడాకులు తీసుకున్నారు.