యానిమల్ బోల్డ్ సీన్స్‌లోకి అనసూయని లాగి తెగ ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్స్

యాంకర్ అనసూయ గురించి తెలగు రాష్ట్రాల ప్రజలకి ప్రత్యకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని ఎంతగానో అలరిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు యాంకర్‌గా పలు టీవీ షోలలో తెగ సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం యాంకరింగ్‌కి గుడ్ బై చెప్పి నటిగా అదరగొడుతుంది. ఇటీవల ఆమె విమానం అనే ఓ సినిమాలో నటించగా, ఈ సినిమాలో సుమతి అనే వేశ్య పాత్రలో అనసూయ నటించింది. ఈ సినిమాలో ఆమెది చిన్న పాత్రే అయిన ఓ పక్క గ్లామర్ షో చేస్తూనే మరోపక్క ఇంటిమేట్ సన్నివేశాల్లో అదరగొట్టి అందరి ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం పుష్ప2లోను ఈ భామ నటిస్తుంది.
అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. అప్పుడప్పుడు తనపై ఎవరైన తప్పుడు వ్యాఖ్యలు చేస్తే వారికి గట్టిగా ఇచ్చి పడేస్తుంది. ఆంటీ అంటూ అనసూయని చాలా మంది ట్రోల్ చేస్తుండడంతో వారిపై కేసు కూడా పెట్టింది. అయినప్పటికీ అనసూయపై ట్రోలింగ్ ఆగడం లేదు. కొన్ని నెలల క్రితం అనసూయ.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య పెద్ద వార్ నడిచింది. ఇన్‌డైరెక్ట్‌గా విజయ్ దేవరకొండని టార్గెట్ చేస్తూ ఆమె కామెంట్స్ చేయడం, దానికి విజయ్ ఫ్యాన్స్ ఘాటుగా రెస్పాండ్ అవుతూ ట్రోల్ చేయడం మనం చూశాం. కొన్నాళ్లకే అనసూయనే ఈ వివాదాలకి పులిస్టాప్ పెట్టి మళ్లీ తనపని తాను చూసుకుంటుంది.
అయినప్పటికి యానిమల్ చిత్రంలోని వల్గర్ సీన్స్ వివాదంలోకి అనసూయని లాగి ట్రోల్ చేస్తున్నారు. డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ చిత్రంలో దారుణమైన బోల్డ్ సీన్స్, లిప్ లాక్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి. అయితే అనసూయని నెటిజన్స్ ఈ వివాదంలోకి లాగుతూ యానిమల్ చిత్రం చూడలేదా.. ఇందులో అసభ్యకరమైన సన్నివేశాలు ఉన్నాయి స్పందించవా ? అంటూ ఆమెపై దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి చిత్రంపై అంతగా విరుచుకుపడ్డావు, మరి దీనిపై స్పందించవా అంటూ ఆమెని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై ఏమైన స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.