చోరీ కేసు.. కేంద్ర మంత్రికి అరెస్ట్ వారెంట్

విధాత: ఓ చోరీ కేసులో కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్‌కు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2009లో ప‌శ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌దువార్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలోని బంగారం షాపులో, బీర్‌పాడాలోని మ‌రో రెండు గోల్డ్ షాపుల్లో దొంగ‌త‌నం జ‌రిగింది. దొంగ‌త‌నం కేసులో ప్రామాణిక్‌తో పాటు మ‌రో వ్య‌క్తి నిందితుడిగా ఉన్నారు. ఈ కేసును అలీపూర్‌దువార్ జ్యుడిషియ‌ల్ మెజిస్ట్రేట్ కోర్టు బుధ‌వారం విచారించింది. ఈ సంద‌ర్భంగా కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి ప్రామాణిక్‌కు అరెస్టు […]

చోరీ కేసు.. కేంద్ర మంత్రికి అరెస్ట్ వారెంట్

విధాత: ఓ చోరీ కేసులో కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్‌కు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. 2009లో ప‌శ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌దువార్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలోని బంగారం షాపులో, బీర్‌పాడాలోని మ‌రో రెండు గోల్డ్ షాపుల్లో దొంగ‌త‌నం జ‌రిగింది.

దొంగ‌త‌నం కేసులో ప్రామాణిక్‌తో పాటు మ‌రో వ్య‌క్తి నిందితుడిగా ఉన్నారు. ఈ కేసును అలీపూర్‌దువార్ జ్యుడిషియ‌ల్ మెజిస్ట్రేట్ కోర్టు బుధ‌వారం విచారించింది. ఈ సంద‌ర్భంగా కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి ప్రామాణిక్‌కు అరెస్టు వారెంట్ జారీ చేసింది కోర్టు.

అయితే ఈ కేసులో ప్రామాణిక్ త‌ర‌ఫు న్యాయ‌వాది దులాల్ ఘోష్ త‌మ త‌దుప‌రి చ‌ర్య ఏమిటో వెల్ల‌డించేందుకు నిరాక‌రించారు. హైకోర్టు ఆదేశం మేరకు ఈ కేసును ఉత్తర 24 పరగణాల జిల్లా ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు నుంచి అలీపూర్‌దువార్‌ కోర్టుకు బదిలీ చేశారు.

ప్రామాణిక్‌ 2019లో బీజేపీలో చేరి లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. అంతకు ముందు ఆయనను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు గానూ తృణమూల్‌ నుంచి బహిష్కరించారు.