దీవాళి సందర్భంగా హౌజ్‌లో సందడే సందడి.. పండగ రోజు ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే..!

బిగ్ బాస్ సీజన్ 7 సక్సెస్ ఫుల్‌గా పది వారాలు పూర్తి చేసుకుంది. పదో వారం ఊహించని ఎలిమినేషన్ జరిగింది. ఇక ఐదు వారాలే మిగిలి ఉన్న నేపథ్యంలో హౌజ్‌మేట్స్ గట్టిగా ఆడి కప్ గెలుచుకొని వెళ్లాలని అనుకుంటున్నారు.ఇక దీపావళి సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేయగా, ఈ షోలో సెలబ్రిటీల రాకతో పాటు పలువురు ఆటపాటలు, హైపర్ ఆది కామెడీ తెగ వినోదం పంచింది. ముందుగా నాగార్జున హౌజ్‌మేట్స్‌కి ఓ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో భాగంగా ఒక్క నిమిషం ట్రైమ్ ఫ్రేమ్ లో ఐదు టీమ్ లు తమ కళ్లకి గంతలు కట్టుకొని క్రాకర్స్ కార్డ్స్ ను తమ బుట్టలో వేయాల్సి ఉంటుంది.ముందుగా ఈ గేమ్ లో యావర్ – అశ్విని ఆడారు. ఆ తర్వాత అమర్ దీప్ -ప్రియాంక, బోలే – అర్జున్, గౌతమ్ – శోభా, యావర్ – రతిక టీమ్ గా ఆడారు. అమర్ దీప్ – ప్రియాంక 410 స్కోర్ చేయగా వారికి నాగ్ బెస్ట్ విషెస్ తెలియజశారు. ఇక లీస్ట్ లో గౌతమ్ కృష్ణ – శోభా 75 స్కోర్ తో నిలిచారు.
దీపావళి సందర్భంగా బిగ్ బాస్ వేదికపై హౌజ్‌మేట్స్ ఫ్యామిలీ వచ్చి సందడి చేశారు. ముందుగా హౌజ్ లోకి అమర్ తల్లి, హీరో మానస్ ను ఆహ్వానించారు. వారు పలు సూచనలు చేశారు. అనంతరం గౌతమ్ కృష్ణకూ సర్ ప్రైజ్ ఇస్తూ ఆయన బ్రదర్స్ రాగా, వారు గౌతమ్‌ని ఎలిమినేషన్ నుండి సేవ్ చేశారు. ఇలా పలువురు కంటెస్టెంట్స్ ఫ్యామిలీ రావడం వారికి పలు సూచనలు చేయడం అనంతరం కొందరిని సేవ్ చేయడం కూడా జరిగింది. ఇక నాగార్జున హౌజ్‌మేట్స్‌కి వివిధ రకాల కలర్స్ గల కవర్స్ కలిగిన చాక్లెట్స్ ను కంటెస్టెంట్లకు అందించారు. ఆయా కలర్స్ బట్టి పోటీదారుల్లోని నెగెటివ్, ఇగ్నోర్, నాట్ వర్తీలను తెలుపుతూ చాక్లెట్స్ ను అందించారు. ఎక్కువ చాక్లెట్స్ వచ్చిన అమర్, రతికలకి రావడంతో వారు మరింతగా గేమ్ ఆడాలని సూచించారు నాగ్.
ఇక ఈ గేమ్ కొనసాగుతుండగానే, శోభాశెట్టి తన ప్రియుడి పేరును రివీల్ చేసింది. మూడేళ్లుగా శోభా యశ్వంత్ రెడ్డి అనే వ్యక్తితో రిలేషన్ లో ఉందని , అతనిని ముద్దుగా ‘పాపు’ అని పిలుచుకుంటానని చెప్పుకొచ్చింది. అతను కూడా బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చి ఆమెకి బెస్ట్ విషెస్ అందించాడు. ఇక శ్రీలీల, వైష్ణవ్ తేజ్ రాబోయే సినిమా ‘ఆదికేశవ’ ప్రమోషన్‌లో భాగంగా బిగ్ బాస్ హౌజ్‌కి వచ్చి సందడి చేశారు. హజ్‌మేట్స్ వారిక ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక కాజల్ అగర్వాల్, బుచ్చిబాబు, సోహెల్, ఇమ్మానుయేల్, రితికా సింగ్, ఫరియా అబ్దుల్లా తదితరులు స్టైజీపై సందడి చేశారు.హైపర్ ఆది ఎప్పటి మాదిరిగానే తన మాటలతో తెగ సందడి చేశాడు. ఇక నామినేషన్స్‌లో ఉన్నవారిలో ఎలిమినేట్ అయ్యేందుకు చివరిగా యావర్, భోలే నిలిచారు. ఎలిమినేషన్ టైమ్ లో చివరికి హౌజ్ ను భోలే షావలి వీడారు. హౌజ్ లో ఐదు వారాల పాటు అద్భుతమైన ఆటతో ప్రేక్షకులను అలరించి చివరికి పాట పాడి హౌజ్‌ని వీడారు.