బిగ్ బాస్ సీజన్ 7 విజేత అతనే.. ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది అంటే..!

బిగ్ బాస్ సీజన్ 7 విజేత ఎవరు అనే దానిపై మరి కొద్ది గంటలలో క్లారిటీ రానుంది. ప్రస్తుతం హౌజ్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉండగా, అందులో శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, యావర్, ప్రియాంక, అర్జున్ అంబటి మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. వీరిలో ఎవరు కప్ కొడతారు అనే దానిపై అందరిలో ఓ క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పటికే ఫినాలేకి సంబంధించిన షూట్ పూర్తైన కూడా విజేత ఎవరు అనేది బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారట. టాప్ 6లో ఉన్న అంబటి ముందుగా ఎలిమినేట్ అయ్యాడని, ఆ తర్వాత ప్రియాంక ఎలిమినేట్ అయినట్టు తెలుస్తుంది.
రవితేజ హౌజ్‌లోకి వెళ్లి ప్రియాంకని ఎలిమినేట్ చేసి బయటకు తీసుకొచ్చినట్టు లీకుల సమాచారం. ఆ తర్వాత యావర్ బిగ్ బాస్ ఇచ్చిన రూ.15లక్షల ఆఫర్‌కి టెంప్ట్ అయి ఆ సూట్ కేసు తీసుకొని బయటకు వచ్చాడని అంటున్నారు. ఇక మిగిలింది పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్ కాగా, వీరిలో ఎవరు విన్నర్ అనేది రివీల్ కాకుండా జాగ్రత్తపడుతున్నారు. తాజా సమచారం ప్రకారం.. టైటిల్ పక్కా తనదేనని ఆలోచనలో ఉన్న శివాజీ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యాడని, అతనికి రన్నరప్ స్థానం దక్కలేదని అంటున్నారు. అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య టఫ్ ఫైట్ కొనసాగగా, చివరికి పల్లవి ప్రశాంత్‌నే కప్ వరించిందని సమాచారం.
ఇక ఫినాలే ను ఎప్పటి మాదిరిగానే చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారట. సుమతో పాటు ఆయన తనయుడు బబుల్ గమ్ మూవీ ప్రమోషన్ కోసం హాజరయ్యారు. కళ్యాణ్ రామ్ కూడా తన మూవీ ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టారని సమాచారం. ఇక యాంకర్ శ్రీముఖి, హీరోయిన్ నిధి అగర్వాల్ డాన్స్, మాస్ మహారాజాలతో ఎంట్రీ తో ఫినాలే ఫుల్ ఎంటర్‌టైన్ చేయనుందని తెలుస్తుంది.