మంత్రి మల్లారెడ్డిపై TRS ఎమ్మెల్యేల తిరుగుబాటు..మైనంపల్లి ఇంట్లో భేటీ

విధాత: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో భేటీ కావడం టీఆర్ఎస్‌లో కాక రేపింది. ఎమ్మెల్యేలు మైనంపల్లి, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, వివేకానంద, భేతి సుభాష్ రెడ్డిలు ఈ భేటీలో ఉన్నారు. మంత్రి మల్లారెడ్డి తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడం పట్ల ఎమ్మెల్యేలు చర్చించినట్లు తెలిసింది. భేటీ అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉప్పల్, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి సహా తమ నియోజక వర్గాల్లో మంత్రి మల్లారెడ్డి రాజకీయ, అభివృద్ధి విషయాల్లో తల […]

మంత్రి మల్లారెడ్డిపై TRS ఎమ్మెల్యేల తిరుగుబాటు..మైనంపల్లి ఇంట్లో భేటీ

విధాత: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో భేటీ కావడం టీఆర్ఎస్‌లో కాక రేపింది. ఎమ్మెల్యేలు మైనంపల్లి, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, వివేకానంద, భేతి సుభాష్ రెడ్డిలు ఈ భేటీలో ఉన్నారు.

మంత్రి మల్లారెడ్డి తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడం పట్ల ఎమ్మెల్యేలు చర్చించినట్లు తెలిసింది. భేటీ అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉప్పల్, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి సహా తమ నియోజక వర్గాల్లో మంత్రి మల్లారెడ్డి రాజకీయ, అభివృద్ధి విషయాల్లో తల దూర్చడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

తమను సంప్రదించకుండా నామినేటెడ్ పదవుల భర్తీలో ఏకపక్షంగా వ్యవహరించడం, ఒక వర్గానికే పదవులు దక్కడం సరైనది కాదన్నారు. ప్రోటోకాల్ పట్టించుకోవడం లేదన్నారు. ఆయా అంశాలపై తమ అభ్యంతరాలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇంతకుమించి తమ భేటీకి ఎలాంటి ఇతర రాజకీయ ప్రత్యేకత లేదని వారు తెలిపారు.