Breaking: ఎమ్మెల్సీ కవితకు CBI నోటీసులు.. స్పందించిన ఎమ్మెల్సీ
CBI NOTICE: విధాత, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. 160 సిఆర్పిసి కింద వివరణ ఇవ్వాలని నోటీసులలో పేర్కొంది. ఈనెల 6న విచారణకు రావాల్సిందిగా నోటీస్ ఇచ్చింది. ఈ కేసులో అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ఈడి కవిత పేరును చేర్చింది. కాగా కవితను ఢిల్లీ, హైదరాబాద్‌లలోని తమ కార్యాలయాల్లో ఎక్కడైనా ఆమె విచారణకు హాజరు కావచ్చని సీబీఐ పేర్కొంది. లిక్కర్ స్కామ్‌లో లెక్కల […]

CBI NOTICE: విధాత, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. 160 సిఆర్పిసి కింద వివరణ ఇవ్వాలని నోటీసులలో పేర్కొంది. ఈనెల 6న విచారణకు రావాల్సిందిగా నోటీస్ ఇచ్చింది. ఈ కేసులో అరెస్ట్ అయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో ఈడి కవిత పేరును చేర్చింది. కాగా కవితను ఢిల్లీ, హైదరాబాద్‌లలోని తమ కార్యాలయాల్లో ఎక్కడైనా ఆమె విచారణకు హాజరు కావచ్చని సీబీఐ పేర్కొంది.
లిక్కర్ స్కామ్‌లో లెక్కల వివరాలను సేకరించేందుకు సీబీఐ ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కాగా సీబీఐ నోటీసులో కవితను లిక్కర్ కేసులో ఆమెకు తెలిసి వివరాలు చెప్పాలని పేర్కొని.. ఢిల్లీలో ఉంటారా హైదరాబాదులో ఉంటారా చెబితే వస్తామని పేర్కొనగా హైదరాబాద్ ఇంట్లోనే ఉంటానని ఎమ్మెల్సీ కవిత చెప్పారు.
ఈనెల 6న కవిత ఇంట్లో సీబీఐ ఆమె నుంచి వివరణ తీసుకోనుంది. అటు కవిత తనకు సీబీఐ నోటీసులు అందాయని వివరణ కోసమే సీబీఐ నోటీసులు ఇచ్చిందని, ఈనెల 6న తన ఇంట్లోనే సీబీఐకి వివరణ ఇవ్వనున్నట్లుగా ఆమె ధ్రువీకరించారు.