ఎట్టకేలకి పెళ్లిపై క్లారిటీ… ఆ హీరో ఒప్పుకోగానే చేసుకుంటానన్న ఛార్మి

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ చాలా మందే ఉన్నారు. ఇందులో కొందరు హీరోలు ఉండగా, మరి కొందరు హీరోయిన్స్ ఉన్నారు. అయితే అందాల బొద్దుగుమ్మ ఛార్మి ఒకానొక సమయంలో హీరోయిన్గా స్టార్ స్టేటస్ పట్టేసి తన అందచందాలతో యువతను అట్రాక్ట్ చేసింది. తర్వాత నిర్మాత అవతారం ఎత్తి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో కలిసి సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటోంది. పూరి కనెక్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభిన ఆమె దాని తాలూకు అన్ని వ్యవహారాలు చూసుకుంటుంది. అయితే కెరీర్ పరంగా చాలా బిజీగా ఉంటున్న ఛార్మి పెళ్లి ఊసే ఎత్తడం లేదు.
చిన్న వయసులోనే సినీ గడపతొక్కిన ఛార్మి.. గత 20ఏళ్లుగా తన సినీప్రయాణాన్ని కొనసాగిస్తోంది. అయితే అమ్మడికి పెళ్లి వయసు దాటిపోతుండటంతో అందరి చూపు ఆమె మ్యారేజ్‌పై పడింది.ఛార్మీ పెళ్లెప్పుడు అంటూ పలువురు సోషల్ మీడియాలో ఆమెని విసిగించడం మొదలు పెట్టారు.ఆ సమయంలో ఓ సారి ప్రస్తుతం కెరీర్ హాయిగా, సాఫీగా సాగిపోతోంది. ఈ లైఫ్ నాకు చాలా సంతోషకరంగా ఉంది. నా జీవితంలో పెళ్లి చేసుకోవడం వంటి తప్పు చేయను అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇది చూసి అందరు షాక్ అయ్యారు. అయితే 36 ఏళ్ల ఛార్మి ఒకప్పుడు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తో రిలేషన్ లో ఉందని, అతనితో బ్రేకప్ కావడం వల్లనే పెళ్లిపై తనకు విసుగు వచ్చిందని కొందరు చెప్పుకొచ్చారు.
తాజాగా తన పెళ్లి గురించి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఛార్మి తనకు హృతిక్ రోషన్ అంటే చాలా ఇష్టం అని , తనకి పెళ్లి జరిగిందని తెలిసి చాలా బాధపడ్డానని పేర్కొంది. కొద్ది రోజుల క్రితం ఆయనకి విడాకులు కాగా, ఆయన వేరే యువతితో రిలేషన్లో ఉన్నట్టు టాక్ నడుస్తుంది. అయితే హృతిక్ రోషన్ మళ్లీ పెళ్లి జరిగితే నేను పెళ్లి చేసుకుంటానని ఆయన పెళ్లి తర్వాతే నా పెళ్లి జరుగుతుంది అంటూ చార్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఛార్మి తన పెళ్లిపై చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్గా మారాయి.