8 నూతన వైద్య క‌ళాశాల‌ల్లో రేపటి నుంచి త‌ర‌గ‌తులు

ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభించ‌నున్న సీఎం కేసీఆర్‌ విధాత: రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యాబోధనా తరగతులు ప్రారంభం కానున్నాయి. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ప్రగతి భవన్ నుంచి ఆన్‌లైన్‌లో అన్ని క‌ళాశాల‌ను ఒకే సారి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండం పట్టణాల్లోని 8 నూతన ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్ మొద‌టి సంవత్సరం త‌ర‌గ‌తులు సీఎం కేసీఆర్ […]

8 నూతన వైద్య క‌ళాశాల‌ల్లో రేపటి నుంచి త‌ర‌గ‌తులు

ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి ఆన్‌లైన్‌లో ప్రారంభించ‌నున్న సీఎం కేసీఆర్‌

విధాత: రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యాబోధనా తరగతులు ప్రారంభం కానున్నాయి. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ప్రగతి భవన్ నుంచి ఆన్‌లైన్‌లో అన్ని క‌ళాశాల‌ను ఒకే సారి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు.

సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండం పట్టణాల్లోని 8 నూతన ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్ మొద‌టి సంవత్సరం త‌ర‌గ‌తులు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.