జూబ్లీహిల్స్‌ క్రాస్‌రోడ్డుకు అడ్డంగా నిర్మాణం.. మెట్రో, జీహెచ్ఎంసీలకు నోటీసులు

విధాత, హైదరాబాద్: ముందు చూపులేని పట్టణ ప్రణాళికకు జూబ్లీహిల్స్ క్రాసురోడ్డు వద్ద మెట్రోరైలు అథారిటీ నిర్మిస్తున్న కట్టడం పెద్ద ఉదాహరణ. జూబ్లీహిల్స్‌ క్రాసురోడ్డు వద్ద‌ ఇప్పుడే చాలా రద్దీగా ఉంటుంది. క్రాసురోడ్డులో ఒక పెద్ద భవనాన్ని పడగొట్టి మెట్రోరైలు ట్రాకును నిర్మించారు. ట్రాకు నిర్మించగా మిగిలిన త్రికోణాక్రుతి స్థలంలో ఇప్పుడొక పెద్ద భవంతి నిర్మించడానికి మెట్రో యాజమాన్యం పూనుకుంది. ఆ భవనానికి జీహెచ్ఎంసీ అనుమతి కూడా ఇచ్చింది. ఈ భవనం నిర్మిస్తే ముందు ముందు ట్రాఫిక్ చిక్కులు […]

జూబ్లీహిల్స్‌ క్రాస్‌రోడ్డుకు అడ్డంగా నిర్మాణం.. మెట్రో, జీహెచ్ఎంసీలకు నోటీసులు

విధాత, హైదరాబాద్: ముందు చూపులేని పట్టణ ప్రణాళికకు జూబ్లీహిల్స్ క్రాసురోడ్డు వద్ద మెట్రోరైలు అథారిటీ నిర్మిస్తున్న కట్టడం పెద్ద ఉదాహరణ. జూబ్లీహిల్స్‌ క్రాసురోడ్డు వద్ద‌ ఇప్పుడే చాలా రద్దీగా ఉంటుంది. క్రాసురోడ్డులో ఒక పెద్ద భవనాన్ని పడగొట్టి మెట్రోరైలు ట్రాకును నిర్మించారు.

ట్రాకు నిర్మించగా మిగిలిన త్రికోణాక్రుతి స్థలంలో ఇప్పుడొక పెద్ద భవంతి నిర్మించడానికి మెట్రో యాజమాన్యం పూనుకుంది. ఆ భవనానికి జీహెచ్ఎంసీ అనుమతి కూడా ఇచ్చింది. ఈ భవనం నిర్మిస్తే ముందు ముందు ట్రాఫిక్ చిక్కులు పెరుగుతాయని, ఇప్పటికే రద్దీగా ఉండే క్రాసురోడ్డులో ఈ నిర్మాణం పూర్తయితే ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతుందని ఇంద్రసేన చౌదరి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు మెట్రో యాజమాన్యానికి, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసింది. రోడ్డు నంబరు ౩6 నుంచి వచ్చే వాహనాలను జూబిలీ హిల్స్ క్లబ్బు రోడ్డుకు మళ్లించి చుట్టూ తిప్పుతున్నారు. వాహనదారులకు ఫ్రీ లెఫ్ట్ అవకాశం లేకుండా చేశారు. ఈ భవనము నిర్మిస్తే రోడ్డు విస్తరణకు అవకాశం లేకుండా పోతుంది ట్రాఫిక్ సమస్యలు మరింత పెరుగుతాయ‌ని ఇంద్రసేన తెలిపారు.