పుష్ప3 క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది..పార్ట్ 3 ఎప్పుడు రిలీజ్ కానుంది, స్టార్స్ ఎవరంటే?

స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్‌ని ఐకాన్ స్టార్ చేసిన చిత్రం పుష్ప. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం ప్రకంపనలు పుట్టించింది. దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రేక్షకుల మనసులు దోచుకుంది.ముఖ్యంగా చిత్రంలో అల్లు అర్జున్ నటనతో పాటు ఆయన బాడీ లాంగ్వేజ్‌కి ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులు అయ్యారు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ కూడా దక్కించుకున్నాడు. ఇక ప్రస్తుతం పుష్ప2 చిత్రంతో బన్నీ బిజీగా ఉండగా, ఈ సినిమాకి సంబంధించి బయటకు వస్తున్న క్రేజీ అప్‌డేట్స్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తున్నాయి.
అయితే పుష్ప 2 సెట్స్‌పై ఉండగానే, దీనికి సీక్వెల్‌గా మరో చిత్రం ఉంటుందని అల్లు అర్జున్ ఆ మధ్య ఫిల్మ్ ఫెస్టివల్‌లో చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి పుష్ప3పై ఉంది. ఇందులో ఎవరు నటిస్తారు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది ఇలా ఎన్నో అనుమానాలు సినీ ప్రియులలో కలిగాయి. అయితే పుష్ప 2 కి సంబంధించిన కంటెంట్ చూసిన తర్వాత, పార్ట్ 3 కచ్చితంగా అవసరం అని భావించిన సుకుమార్ పుష్ప3 కథని కూడా సిద్ధం చేసాడని ఓ టాక్ నడుస్తుంది. `పుష్ప2`తోపాటే మూడో పార్ట్ కి సంబంధించిన మేజర్‌పోర్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.
అయితే పుష్ప2 చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానుండగా, దీని తర్వాత మూడో పార్ట్ కి సంబంధించిన మిగిలిన పార్ట్ ని సుకుమార్ పూర్తి చేయాలని భావిస్తున్నట్టు టాక్. అయితే వచ్చే ఏడాది సమ్మర్‌లో పుష్ప 3 రిలీజ్ చేయాలనుకుంటున్నారట. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పార్ట్ 3లో జాయిన్ కానున్నాడని సమాచారం.మరోవైపు పుష్ప2లో కూడా ఆయన ఉంటాడని కొందరు చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైన ఇప్పుడు అల్లు అర్జున్ మూవీలకి సంబంధించి వస్తున్న వార్తలు మాత్రం ఫ్యాన్స్‌కి ఓ రేంజ్ ఆనందాన్ని పెంచుతున్నాయంటే అతిశయోక్తి కాదు. కాగా, పుష్ప2 మూవీ నెక్ట్స్ షెడ్యూల్ మార్చి 8నుంచి ప్రారంభం కానుంది. వైజాగ్‌లో జరగనున్న ఈ షెడ్యూల్‌లో అల్లు అర్జున్ కూడా పాల్గొంటారని తెలుస్తుంది. `పుష్ప2`లో ఫహద్ ఫాజిల్ నెగటివ్‌రోల్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు