స‌చివాల‌యం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌

విధాత‌: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 18న నయా సెక్రటేరియట్ నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆలోగా భవన నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ పూర్తిచేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులు, షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ముందుగా ఆరో అంతస్తులోని ముఖ్యమంత్రి బ్లాకును ప్రారంభించడంతో పాటు తన ఛాంబర్‌లో చంద్రశేఖర్ రావు బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. ఇక […]

స‌చివాల‌యం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌

విధాత‌: తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే ఏడాది జనవరి 18న నయా సెక్రటేరియట్ నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఆలోగా భవన నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ పూర్తిచేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులు, షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ముందుగా ఆరో అంతస్తులోని ముఖ్యమంత్రి బ్లాకును ప్రారంభించడంతో పాటు తన ఛాంబర్‌లో చంద్రశేఖర్ రావు బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలిసింది. ఇక అక్క‌డి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించేందుకు స‌మాయాత్త‌మ‌వుతున్నారు. నూత‌న స‌చివాలయ ప్ర‌వేశం వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.