పంజాబ్‌లో ఘోరం: కారులో మహిళ మృతదేహం లభ్యం
విధాత: పొలాల్లో వదిలిన కారులో మహిళ మృతదేహం లభ్యమైన ఘటన పంజాబ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. స్థానికుల సమాచారం మేరకు చండీగడ్ సమీపంలోని జిరాక్‌పూర్‌లోని సతాప్‌గఢ్ గ్రామంలోని పొలాల్లో పార్క్ చేసిన కారులో 35 ఏండ్ల వివాహిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తి వాహనాన్నిఅక్కడే వదిలి పరారయ్యాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వివాహిత డేరా బస్సీకి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. వివాహిత మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించ లేదు. తెల్లటి టీ షర్టు, […]

విధాత: పొలాల్లో వదిలిన కారులో మహిళ మృతదేహం లభ్యమైన ఘటన పంజాబ్ రాష్ట్రంలో సంచలనం రేపింది. స్థానికుల సమాచారం మేరకు చండీగడ్ సమీపంలోని జిరాక్‌పూర్‌లోని సతాప్‌గఢ్ గ్రామంలోని పొలాల్లో పార్క్ చేసిన కారులో 35 ఏండ్ల వివాహిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
గుర్తు తెలియని వ్యక్తి వాహనాన్నిఅక్కడే వదిలి పరారయ్యాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వివాహిత డేరా బస్సీకి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. వివాహిత మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించ లేదు. తెల్లటి టీ షర్టు, నీలిరంగు ప్యాంటు ధరించిన 25 ఏండ్ల వ్యక్తి కారులోంచి బయటకు పరుగెత్తడాన్ని ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు చూశారని పోలీసులు తెలిపారు.
దీంతో అతడు పొలాల్లో నుంచి తప్పించుకుని పారిపోవడంతో అక్కడి ప్రజలు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించామని తెలిపారు.
నిందితులను పట్టుకునేందుకు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు. పంజాబ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటన ఇది రెండోదని, వరుసగా వెలుగు చూస్తున్న మహిళల అనుమానాస్పద మృతి కేసులతో పంజాబ్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.