సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌పై ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు

విధాత: నకిలీ హ్యాండ్లూమ్ వస్త్రాలు విక్రయిస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకు కొత్త‌పేట‌లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో తనిఖీలు నిర్వహించామని హ్యాండ్లూమ్ టెక్ట్స్‌టైల్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. సంబంధిత షాప్ యజమానుల పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం చేనేత పరిరక్షణ చట్టం ప్రకారం 11ఐటమ్స్‌ చేనేత వారికి రిజర్వ్ చేసినట్టు తెలిపారు. అలా రిజర్వ్ చేసిన ఐటమ్స్‌ను మరమగ్గాలపై టెక్స్ టైల్స్ ఇండస్ట్రీ వారు తయారీ, ప్రింట్ చేస్తున్నారు. అలా త‌యారైన […]

సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌పై  ఎన్ ఫోర్స్ మెంట్ దాడులు

విధాత: నకిలీ హ్యాండ్లూమ్ వస్త్రాలు విక్రయిస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకు కొత్త‌పేట‌లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో తనిఖీలు నిర్వహించామని హ్యాండ్లూమ్ టెక్ట్స్‌టైల్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. సంబంధిత షాప్ యజమానుల పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

భారత ప్రభుత్వం చేనేత పరిరక్షణ చట్టం ప్రకారం 11ఐటమ్స్‌ చేనేత వారికి రిజర్వ్ చేసినట్టు తెలిపారు. అలా రిజర్వ్ చేసిన ఐటమ్స్‌ను మరమగ్గాలపై టెక్స్ టైల్స్ ఇండస్ట్రీ వారు తయారీ, ప్రింట్ చేస్తున్నారు. అలా త‌యారైన వ‌స్త్రాల‌ను ఇటువంటి షాపింగ్ మాల్స్‌లో ప్రజలకి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ పేరుతో విక్రయిస్తూ మోసం చేస్తున్నార‌ని ఆరోపించారు.