ఢిల్లీ లిక్కర్ స్కామ్: అభిషేక్, విజయ్ రిమాండ్ పొడిగింపు
విధాత: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అభిషేక్ బోయిన్‌పల్లి, విజయ్ నాయర్‌లకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు వారిని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబులకు జైలులో ఇంటి ఆహారం తెచ్చుకుంటామంటే జైలు నిబంధనల ప్రకారం అది కుదరదని కోర్టు నిరాకరించింది. అదే సందర్భంలో నిందితులు తమకు ఏదైనా కావాలని అనిపిస్తే అధికారులతో మాట్లాడి జైలులో ఉన్న కిచన్‌లోనే […]

విధాత: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అభిషేక్ బోయిన్‌పల్లి, విజయ్ నాయర్‌లకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఈడీ కస్టడీ ముగియడంతో అధికారులు వారిని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఇప్పటికే జ్యుడీషియల్
రిమాండ్‌లో ఉన్న శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబులకు జైలులో ఇంటి ఆహారం తెచ్చుకుంటామంటే జైలు నిబంధనల ప్రకారం అది కుదరదని కోర్టు నిరాకరించింది. అదే సందర్భంలో నిందితులు తమకు ఏదైనా కావాలని అనిపిస్తే అధికారులతో మాట్లాడి జైలులో ఉన్న కిచన్‌లోనే తగిన ఏర్పాటు చేసుకోవచ్చని సూచించింది.
అలాగే కొన్ని పుస్తకాలు కావాలని కోరినప్పుడు జైలులో ఉన్న లైబ్రరీలో అన్ని పుస్తకాలు ఉంటాయని వాటిని చదువుకోవాలన్నది. అవి కాకుండా తమకు కొన్ని ప్రత్యేక పుస్తకాలు కావాలని నిందితుల తరఫున న్యాయవాది కోరగా అందుకు సీబీఐ కోర్టు అంగీకరించింది.
మరోవైపు ఈడీ కస్టడీలో ఉన్న విజయ్‌నాయర్ విషయంలో కస్టడీకి మరో ఐదు రోజుల పాటు కొనసాగించాలని చెప్పి ఈడీ కోరింది. ఇప్పటికే రూ.30 కోట్లు తరలించిన వ్యవహారం, అలాగే రూ. 100 కోట్లకు సంబంధించిన ముడుపుల వ్యవహారంలో విజయ్ నాయర్ నుంచి మరికొంత సమాచారం రాబట్టాల్సి ఉన్నదని కాబట్టి తమ కస్టడీని మరో ఐదు రోజులు కొనసాగించాలని ఈడీ అధికారులు కోరారు.
ఇప్పటికే ఈడీ అన్నిరకాల వాంగ్మూలాలను నమోదు చేసిందని, అన్ని రకాల సాక్ష్యాధారాలు సేకరించింది. కాబట్టి ఈ కేసులో విజయ్ నాయర్ కస్టడీకి కొనసాగించాల్సిన అవసరం లేదని ఆయన తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు రెండు రోజుల కస్టడీ కొనసాగించడానికి అనుమతి ఇస్తూ తీర్పు వెలువరించింది