మంచిర్యాలలో ఘోరం .. ఒకే కుటుంబానికి చెందిన‌ ఆరుగురు సజీవ దహనం

విధాత‌: మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. అగ్నిప్రమాదం జరిగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. ఇంట్లో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందారు. ఇంటి యజమాని శివయ్య, ఆయన భార్య పద్మ, పద్మ అక్క కుమార్తె మౌనిక, ఆమె ఇద్దరు కుమార్తెలు, సింగరేణి ఉద్యోగి శాంతయ్య ఈఘటనలో సజీవ దహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్‌లో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై […]

మంచిర్యాలలో ఘోరం .. ఒకే కుటుంబానికి చెందిన‌ ఆరుగురు సజీవ దహనం

విధాత‌: మంచిర్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. అగ్నిప్రమాదం జరిగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. ఇంట్లో మంటలు చెలరేగి ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు మృతి చెందారు.

ఇంటి యజమాని శివయ్య, ఆయన భార్య పద్మ, పద్మ అక్క కుమార్తె మౌనిక, ఆమె ఇద్దరు కుమార్తెలు, సింగరేణి ఉద్యోగి శాంతయ్య ఈఘటనలో సజీవ దహనమయ్యారు.

అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్‌లో ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై డీసీపీ అఖిల్‌ మహాజన్‌ ఆరా తీశారు. ఈమేర‌కు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.