శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు
విధాత: శివారాధనకు కార్తీకమాసం ఎంతో మహిమాన్వితమైనదని అందరికీ తెలిసినదే. ఏమాసంలోనైనా శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శనం చేసుకోవడం గొప్పవరంగా భావిస్తాం. అలాంటిది కార్తీకమాసం, అదీ చివరి వారం అందులోను ఆదివారం సెలవుదినం కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి వేకువజామున నాలుగు గంటల నుంచే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ కారణంగా స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలను ఆలయ అధికారులు రద్దు చేశారు. భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనం మాత్రం కల్పిస్తున్నారు. […]

విధాత: శివారాధనకు కార్తీకమాసం ఎంతో మహిమాన్వితమైనదని అందరికీ తెలిసినదే. ఏమాసంలోనైనా శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శనం చేసుకోవడం గొప్పవరంగా భావిస్తాం.
అలాంటిది కార్తీకమాసం, అదీ చివరి వారం అందులోను ఆదివారం సెలవుదినం కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి వేకువజామున నాలుగు గంటల నుంచే క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.
భక్తుల రద్దీ కారణంగా స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలను ఆలయ అధికారులు రద్దు చేశారు. భక్తులందరికి స్వామివారి అలంకార దర్శనం మాత్రం కల్పిస్తున్నారు. పాతాళగంగ లో భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తీక పుణ్య స్నానాలచరిస్తున్నారు. అనంతరం కార్తీక దీపాలు వెలిగించి భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. దీంతో శ్రీశైల ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి.