Women’s day gift | మహిళలకు ప్రధాని మోదీ శుభవార్త.. మహిళా దినోత్సవ కానుకగా వంట గ్యాస్‌ ధర తగ్గింపు

Women’s day gift | మహిళలకు ప్రధాని మోదీ శుభవార్త.. మహిళా దినోత్సవ కానుకగా వంట గ్యాస్‌ ధర తగ్గింపు

Women’s day gift : మహిళా దినోత్సవం (Women’s day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ (శుక్రవారం) కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు మహిళా దినోత్సవ కానుకగా వంట గ్యాస్‌ సిలిండర్‌ (Gas Cylinder) ధరను తగ్గించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) తన అధికారిక ఎక్స్‌ (X) ఖాతా ద్వారా వెల్లడించారు.

తమ ప్రభుత్వ నిర్ణయం దేశవ్యాప్తంగా కొన్ని మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ముఖ్యంగా భారత దేశ నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపారు. వంట గ్యాస్‌ ధరను తగ్గించడంతో దేశంలోని ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుందని రాసుకొచ్చారు. ఇది మహిళలకు సాధికారత కల్పించేందుకు, వారి జీవనాన్ని సులభతరం చేయడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

‘ఇది దేశవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా మా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది. వంట గ్యాస్‌ ధరను తగ్గించడంతో ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఇది మహిళలకు సాధికారత కల్పించేందుకు, వారి జీవనాన్ని సులభతరం చేయడానికి దోహదపడుతుంది’ అని ప్రధాని తన ఎక్స్‌ ఖాతాలో రాసుకున్నారు.