సీఎం కేసీఆర్, కేటీఆర్.. స్థలం ఇవ్వండి దవాఖాన కడతా: కేఏ పాల్
విధాత: ఉప ఎన్నికల్లో గెలిపిస్తే 15 రోజుల్లో మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రూపు రేఖలు మార్చివేస్తామన్న సీఎం కేసీఆర్, కేటీఆర్ అటువైపు కూడా చూడడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ విమర్శించారు. ఎన్నికల హామీ మేరకు 15 రోజుల్లో చండూరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తామని, అలాగే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తామని గొప్పలు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ఊసే తీసుకురావడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజల […]

విధాత: ఉప ఎన్నికల్లో గెలిపిస్తే 15 రోజుల్లో మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రూపు రేఖలు మార్చివేస్తామన్న సీఎం కేసీఆర్, కేటీఆర్ అటువైపు కూడా చూడడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ విమర్శించారు.
ఎన్నికల హామీ మేరకు 15 రోజుల్లో చండూరును రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తామని, అలాగే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తామని గొప్పలు చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ఊసే తీసుకురావడం లేదని మండిపడ్డారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజల కోసం వెంటనే హాస్పిటల్ కట్టాలని లేదంటే తమ చారిటీకి చల్మేడలో 5 ఎకరాల స్థలం ఇస్తే పక్షంలో తానే స్పెషాలిటీ ఆసుపత్రిని సూపర్ స్టార్ కృష్ణ పేరుతో కడతానని అన్నారు. తాను ఇప్పటికే చల్మేడ లో ఆసుపత్రికి స్థలం చూశానని, రేపు శంకుస్థాపన చేస్తున్నానని పాల్ ప్రకటించారు.