Patym | పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఎన్‌పీసీఐ..!

Patym | పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పిన ఎన్‌పీసీఐ..!

Patym | పేటీఎం యూజర్లకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. పేటీఎం యూపీఐ సేవలను కొనసాగుతాయని కీలక ప్రకటన చేసింది. ఆర్‌బీఐ విధించిన ఆంక్షలు కేవలం పేటీఎం బ్యాంక్‌ మాత్రమేపై ప్రభావం చూపుతుందని.. యూపీఐ సేవలు యథావిధిగా కొనసాగుతాయని క్లారిటీ ఇచ్చింది. మల్టిపుల్‌ బ్యాంక్‌ మోడల్‌లో యూపీఐ చెల్లింపులు కోసం పేటీఎంకు థర్డ్‌ పార్టీ యాప్‌ ప్రొవైడర్‌ లైసెన్స్‌ జారీ చేసినట్లు తెలిపింది. పేటీఎం పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్‌గా నాలుగు బ్యాంకులు వ్యవహరించనున్నాయి. ఇందులో యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్ బ్యాంక్ వ్యవహరించనున్నట్లు ఓ ప్రకటనలో ఎన్‌పీసీఐ తెలిపింది. పేటీఎంలో ఇప్పటికే ఉన్న, కొత్త యూపీఐ వ్యాపారులకు మర్చంట్ కొనుగోలు బ్యాంకుగా ఎస్ బ్యాంక్ వ్యవహరించనుంది. @Paytm హ్యాండిల్ ఎస్ బ్యాంక్‌కి రీడైరెక్ట్‌ కానున్నది. దాంతో ఇప్పటికే ఉన్న వినియోగదారులు, వ్యాపారులు యూపీఐ లావాదేవీలు, ఆటోపే సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయని వివరించింది.