గంట గంటకు విష‌మంగా హీరో కృష్ణ ఆరోగ్యం: వైద్యులు

విధాత: నటుడు కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై గచ్చిబౌలి కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు మీడియా సమావేశం నిర్వహించి హెల్త్‌ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నదని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 24 గంటల నుంచి 48 గంటల వరకు ఏమీ చెప్పలేమని, కృష్ణకు ఐసీయూలో నిరంతర వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఆయనను అర్ధరాత్రి అపస్మారక స్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చారని, తీవ్ర గుండెపోటు వచ్చిన ఆయనకు సీపీఆర్‌ చేశామని వైద్యులు తెలిపారు. కార్డియాక్‌ అరెస్టుకు […]

గంట గంటకు విష‌మంగా హీరో కృష్ణ ఆరోగ్యం: వైద్యులు

విధాత: నటుడు కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై గచ్చిబౌలి కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు మీడియా సమావేశం నిర్వహించి హెల్త్‌ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నదని, వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 24 గంటల నుంచి 48 గంటల వరకు ఏమీ చెప్పలేమని, కృష్ణకు ఐసీయూలో నిరంతర వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.

ఆయనను అర్ధరాత్రి అపస్మారక స్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చారని, తీవ్ర గుండెపోటు వచ్చిన ఆయనకు సీపీఆర్‌ చేశామని వైద్యులు తెలిపారు. కార్డియాక్‌ అరెస్టుకు పలు కారణాలు ఉంటాయ‌న్నారు. కార్డియాలజిస్టుల బృందం ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోందని అన్నారు.

ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఆయ‌న ఉన్నార‌న్నారు. చికిత్స‌కు ఆయన శరీరం సహకరిస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు మరోసారి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేస్తామని వైద్యులు వెల్లడించారు.