సూపర్ స్టార్ కృష్ణ ఎలా చనిపోయారంటే?: వైద్యులు

విధాత: సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంబంధించి.. కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు సంచలన విషయాలను బయటపెట్టారు. ఆయనని చివరి స్థితిలో ఎలాంటి నొప్పి లేకుండా ప్ర‌శాంత చిత్తంతో చనిపోవాలనే నిర్ణయం తీసుకున్నామని, అందుకే ఆయనకి చివరి నిమిషంలో ఎటువంటి వైద్యం అందివ్వలేదని అధికారికంగా ప్రకటించారు. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కాంటినెంటల్ హాస్పిటల్స్ ఛైర్మన్, డాక్టర్ గురు ఎన్.రెడ్డి మీడియాకు తెలిపారు. కృష్ణ మృతి అనంతరం డాక్టర్ గురు ఎన్ రెడ్డి మీడియాతో […]

సూపర్ స్టార్ కృష్ణ ఎలా చనిపోయారంటే?: వైద్యులు

విధాత: సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంబంధించి.. కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు సంచలన విషయాలను బయటపెట్టారు. ఆయనని చివరి స్థితిలో ఎలాంటి నొప్పి లేకుండా ప్ర‌శాంత చిత్తంతో చనిపోవాలనే నిర్ణయం తీసుకున్నామని, అందుకే ఆయనకి చివరి నిమిషంలో ఎటువంటి వైద్యం అందివ్వలేదని అధికారికంగా ప్రకటించారు. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కాంటినెంటల్ హాస్పిటల్స్ ఛైర్మన్, డాక్టర్ గురు ఎన్.రెడ్డి మీడియాకు తెలిపారు.

కృష్ణ మృతి అనంతరం డాక్టర్ గురు ఎన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కృష్ణగారికి కార్డియాక్ అరెస్ట్‌ రావడంతో.. ఆయన కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో హాస్పిటల్‌కి తీసుకువచ్చారు. అప్పటికే ఆయన స్పృహలో లేరు. అయినా మేము సీపీఆర్ నిర్వహించి.. హార్ట్ బీట్ క్రమీకరించాం. ఎమర్జెన్సీ వార్డులో.. నిపుణులైన డాక్డర్స్‌తో చికిత్స ప్రారంభించాం. కానీ అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా మారింది.

ఆ తర్వాత క్రమక్రమంగా మల్టీపుల్ ఆర్గాన్స్ పనిచేయడం మానేశాయి. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో డయాలసిస్ అవసరం అని.. అది కూడా చేశాం. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తూనే ఉన్నాం.

సోమవారం సాయంత్రానికి ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించింది. వైద్యానికి రెస్పాండ్ కావడం లేదు. దీంతో ఆయనని ఎలాంటి శారీర‌క బాధ క‌లిగించ‌కుండా ప్ర‌శాంతంగా చనిపోనివ్వాలని కుటుంబ సభ్యులతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చాం. దీనికి మెడికల్ విభాగంలో వైద్యనీతి అంటారు. అది కృష్ణగారి విషయంలో ఫాలో అయ్యాం. ఆయనకు చికిత్స అందించినందుకు మేమెంతో గర్వపడుతున్నాం. ఆయన గొప్పమనిషి. ప్రస్తుతం భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాం. తర్వాత కార్యక్రమాలు కుటుంబు సభ్యులు చూసుకుంటారు’’ అని తెలిపారు.