Viral Video | హైద‌రాబాద్‌లో రెచ్చిపోయిన ప్రేమ‌జంట‌.. కారు స‌న్‌రూఫ్‌పై లిప్‌కిస్‌తో రొమాన్స్‌

Viral Video | హైద‌రాబాద్‌లో రెచ్చిపోయిన ప్రేమ‌జంట‌.. కారు స‌న్‌రూఫ్‌పై లిప్‌కిస్‌తో రొమాన్స్‌

Viral Video | ప్రేమికులు హ‌ద్దు మీరుతున్నారు. విచ్చ‌ల‌విడిగా రొమాన్స్‌తో రెచ్చిపోతున్నారు. బ‌హిరంగంగానే కౌగిలింత‌లు, ముద్దుల్లో మునిగిపోతున్నారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఈ మ‌ధ్య‌లో అధిక‌మ‌య్యాయి. ఇటీవ‌లే యూపీలో ఓ జంట బైక్‌పై దూసుకెళ్తూ.. ఎదురెదురుగా కూర్చొని కౌగిలింత‌లు, ముద్దుల‌తో రెచ్చిపోయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా హైద‌రాబాద్‌లో కూడా ఓ ప్రేమ‌జంట రెచ్చిపోయింది.

నిత్యం వాహ‌నాల‌తో ర‌ద్దీగా ఉండే పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై ఇద్ద‌రు ప్రేమికులు రొమాన్స్‌లో మునిగిపోయి కెమెరా కంటికి చిక్కారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి హైద‌రాబాద్ న‌గ‌రంలోకి వ‌చ్చిన ఆ జంట‌.. కారు స‌న్‌రూఫ్‌పై గాల్లో విహ‌రించారు. అయితే మెహిదీప‌ట్నం వ‌ద్ద ఎక్స్‌ప్రెస్ వే దిగే కంటే ముందు.. ఆ జంట లిప్‌కిస్‌ల‌తో రెచ్చిపోయారు. ఈ దృశ్యాల‌ను ఇత‌ర వాహ‌న‌దారులు త‌మ మొబైల్స్ కెమెరాల్లో బంధించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. ఈ వీడియోపై నెటిజ‌న్లు తీవ్రంగా మండిప‌డుతున్నారు. రొమాన్స్‌లో మునిగితేలుతూ సామాన్య ప్ర‌జ‌ల‌కు అసౌక‌ర్యాన్ని క‌లిగించ‌డ‌మే కాకుండా, ప్ర‌యాణంలో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించినందుకు ఆ ప్రేమ‌జంట‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను డిమాండ్ చేస్తున్నారు.