జోరు కొనసాగిస్తున్న రైతు బిడ్డ.. కన్నీరు పెట్టుకున్న యావర్

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం రసవత్తరంగా సాగుతుంది. తెలుగులో సీజన్ 7 జరుపుకుంటుండగా, ఈ కార్యక్రమంకి మరి కొద్ది రోజులలో ముగింపు పడనుంది. చివరి దశకు చేరుకోవడంతో ఒక్కొక్కరు తమ ఫుల్ ఎఫర్ట్స్ పెడుతూ వస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా, వారిలో ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు. అమర్ తప్ప హౌస్ లో మిగిలిన వారందరూ నామినేషన్స్ లో ఉండగా, ఫైనలిస్ట్ కోసం ప్రతి ఒక్కరు గట్టిగా పోటీని ఎదుర్కొంటున్నారు. ఫైనలిస్ట్ కంటెండర్ టాస్క్ కోసం బిగ్ బాస్ రకరకాల టాస్క్‌లు ఇస్తూ వారిలో ఎంత సత్తా ఉందో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజా టాస్క్‌లో భాగంగా క్రికెట్ గేమ్ టాస్క్ ఇచ్చారు. ఇందులో అమర్ దీప్ టాప్‌లో నిలిచారు.
ఇక అనంతరం ‘తప్పింకుచో రాజా’లో ప్రశాంత్ అదరగొట్టారు. అలాగే అమర్ దీప్ కూడా చక్కగా ఆడారు. యావర్, గౌతమ్, అర్జున్ తర్వాత స్థానాల్లో నిలిచారు. ఇక ఇదే సమయంలో అమర్ చేసిన పనికి యావర్ కన్నీళ్లు పెట్టుకున్నాడని శోభాశెట్టి, ప్రియాంక భావించారు. ఆ టాస్క్ లో కాళ్లకు లాక్స్ తో కట్టిన చైన్ లను పోటీదారులు విడిపించుకోవాల్సి ఉంటుంది. మొదట కీ దక్కించుకున్న ప్రశాంత్ టార్గెట్ రీచ్ కాగా , అమర్ దీప్ కీస్ అన్నింటిని గందరగోళంగా పడేయడంతో అర్జున్ చివరలో ఉండాల్సి వచ్చింది. తర్వాతి టాస్క్‌లోను అర్జున్ తీరుని తప్పుపట్టగా అప్పుడు శివాజితో చిన్నపాటి వాగ్వాదం జరిగింది.ఇక యావర్ తన పాయింట్స్‌ని కోల్పోయిన నేపథ్యంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన పాయింట్స్‌ని ప్రశాంత్ కి ఇచ్చాడు యావర్.
పల్లవి ప్రశాంత్ మాత్రం ప్రతి టాస్క్ లోనూ అదరగొడుతూ వస్తుండగా, తాజాగా జరిగిన టాస్క్‌లు అన్నింటిలో కూడా తన నైపుణ్యం అయితే కనబరిచాడు. మరోవైపు అమర్ దీప్ కూడా టాస్క్ లతో సత్తా చాటుతున్నాడు. మంచి స్కోర్ చేస్తున్నారు. దీంతో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ లలో ఒకరు బిగ్ బాస్ ఫినాలే అస్త్ర విన్నర్ గా ఉంటారని తెలుస్తోంది. ఇక నేటి టాస్క్ లను బట్టి ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి. ఎవరు ఆ అస్త్రని దక్కించుకుంటారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది.