జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఎన్నిక‌ల్లో వామ‌పక్షాలు ముందంజ

జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఎన్నిక‌ల్లో వామ‌పక్షాలు ముందంజ

న్యూఢిల్లీ : జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి ఎన్నికలలో (JNUSU)వామపక్షాలు నాలుగు సెంట్రల్ ప్యానెల్ స్థానాల్లో మూడింటిలో ముందంజలో ఉన్నాయి. ప్రారంభంలో ఏబీవీపీ ముందంజలో ఉన్నది, కానీ వామపక్ష విద్యార్థి సంఘాలు దాన్ని అధిగమించాయి. ప్రస్తుతం ఎన్నికల కొంటింగ్ కొనసాగుతున్నది. అంతకుముందు మొత్తం నాలుగు స్థానాల్లో ఏబీవీపీ ఆధిక్యంలో ఉన్నది. విద్యార్థి ఎన్నికలకు శుక్రవారం పోలింగ్‌ జరిగింది. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ( ఏబీవీపీ) నాలుగు సెంట్రల్ ప్యానెల్ పోస్టులు ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీకి పోటీ పడుతున్నది.

2019లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA), స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI), డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (DSF), ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) లు యునైటెడ్-లెఫ్ట్ కూటమి బ్యానర్ కింద వామపక్ష విద్యార్థి సంఘాలు ఎన్నికలలో పోటీ చేయగా ఎస్ఎఫ్ఐ అభ్యర్థి ఐషే ఘోష్ గెలుపొందారు.

ఈసారి నాలుగు పోస్టులకు 19 మంది అభ్యర్థులు, స్కూల్ కౌన్సెలర్ల పోస్టుల కోసం 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 73 శాతం ఓటింగ్‌ నమోదైంది . గత 12 ఏళ్లలో ఇదే అత్యధికం. జేఎన్‌యూ ఎన్నికల్లో 2019లో 67.9 శాతం, 2018లో 67.8 శాతం, 2016-17లో 59 శాతం, 2015లో 55 శాతం, 2013-14లో 55 శాతం, 2012లో 60 శాతం ఓటింగ్ నమోదైంది.

శుక్రవారం ఎన్నికలకు కొన్ని గంటల ముందు తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారంటూ జేఎన్‌యూ విద్యార్థిని 32 గంటలకు పైగా నిరాహారదీక్ష చేసింది. ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ విశ్వవిద్యాలయంలోని గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్‌లో సవాలు చేశారు. దీంతో ఆమె నామినేషన్ రద్దు అయ్యింది. JNUSU ఎన్నికల అభ్యర్థులు లెఫ్ట్ అధ్యక్ష అభ్యర్థి బీహార్‌లోని గయా నుండి ధనంజయ్. ఆయన గెలిస్తే 1996-67లో బత్తిలాల్ బైర్వా తర్వాత వామపక్షాల నుంచి వచ్చిన తొలి దళిత అధ్యక్షుడు అవుతారు.

ఏబీవీపీ అధ్యక్ష అభ్యర్థి ఉమేష్ చంద్ర అజ్మీరా నక్సలైట్ల దాడిలో తన తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయాడు. ఆయన నక్సల్స్ బాధితుడు. ఇతర ఏబీవీపీ అభ్యర్థుల్లో వైస్ ప్రెసిడెంట్‌గా దీపికా శర్మ, కార్యదర్శిగా అర్జున్ ఆనంద్, జాయింట్ సెక్రటరీగా గోవింద్ దాంగి పోటీలో ఉన్నారు.

కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యుఐ జునైద్ రజా అధ్యక్ష పదవికి, ఫర్హీన్ జైదీ జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్నారు. సెంట్రల్ ప్యానెల్ కోసం బీఏపీఎస్ఏ పోటీదారులు బిస్వజిత్ మింజీ అధ్యక్షుడిగా, MD అనస్ ఉపాధ్యక్షునిగా, ప్రియాంషి ఆర్య జాయింట్ సెక్రటరీగా, రూపక్ కుమార్ సింగ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని ఆదివాసీ వర్గానికి చెందిన మింజీ ఎన్నికైనట్లయితే, మొదటి ఆదివాసీ అధ్యక్ష అభ్యర్థి కావచ్చు.