Breaking: సూపర్‌స్టార్ కృష్ణకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
విధాత: సూపర్‌స్టార్ కృష్ణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన శ్వాస సంబంధిత సమస్యతో ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరగాా ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అనారోగ్య కారణాలతో కొంతకాలంగా కృష్ణ ఇంట్లోనే ఉంటున్నారు. భార్య ఇందిరాదేవి ఇటీవల కన్నుమూయడంతో కృష్ణ కృంగిపోయారు. ఆయన తాజా ఆరోగ్య పరిస్థితిపై నటుడు నరేశ్ మీడియాకు వివరించారు. కృష్ణ ఆరోగ్యం బాగానే ఉన్నది. శ్వాస సంబంధిత సమస్యతో నిన్న ఆస్పత్రిలో చేర్చామని 24 గంటల అబ్జర్వేషన్ తర్వాత ఆయనను […]

విధాత: సూపర్‌స్టార్ కృష్ణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన శ్వాస సంబంధిత సమస్యతో ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరగాా ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అనారోగ్య కారణాలతో కొంతకాలంగా కృష్ణ ఇంట్లోనే ఉంటున్నారు. భార్య ఇందిరాదేవి ఇటీవల కన్నుమూయడంతో కృష్ణ కృంగిపోయారు.
ఆయన తాజా ఆరోగ్య పరిస్థితిపై నటుడు నరేశ్ మీడియాకు వివరించారు. కృష్ణ ఆరోగ్యం బాగానే ఉన్నది. శ్వాస సంబంధిత సమస్యతో నిన్న ఆస్పత్రిలో చేర్చామని 24 గంటల అబ్జర్వేషన్ తర్వాత ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారని వెల్లడించారు.