గంటలో వివాహం.. అంతలోనే పెళ్లి కూతురు ఆత్మహత్య
విధాత, నిజామాబాద్: కొద్ది గంటల్లో మెడలో కాబోయే భర్తతో తాళిని కట్టించుకోవాల్సిన నవ వధువు.. ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి కూతురుగా ముస్తాబైన యువతి తెల్లవారితే పెళ్లి అనగా బలవన్మరణానికి పాల్పడడం సంచలనం సృష్టించింది. ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నవీపేటకు చెందిన ర్యాగల రవళి (26) అనే యువతికి నిజామాబాద్‌కు చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు వివాహం ముహూర్తం […]

విధాత, నిజామాబాద్: కొద్ది గంటల్లో మెడలో కాబోయే భర్తతో తాళిని కట్టించుకోవాల్సిన నవ వధువు.. ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి కూతురుగా ముస్తాబైన యువతి తెల్లవారితే పెళ్లి అనగా బలవన్మరణానికి పాల్పడడం సంచలనం సృష్టించింది.
ఈ విషాదకర ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేటలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. నవీపేటకు చెందిన ర్యాగల రవళి (26) అనే యువతికి నిజామాబాద్‌కు చెందిన ఓ యువకుడితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు వివాహం ముహూర్తం నిశ్చయించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం పెళ్లి కూతురు ఇంట్లో మెహందీ, హల్తీ కార్యక్రమం నిర్వహించారు. ఆయా కార్యక్రమంలో రవళి ఉత్సాహంగా పాల్గొని డ్యాన్స్‌లు చేసింది. ఆ తర్వాత బంధువులు పెళ్లికూతురుగా ముస్తాబు చేశారు.
కుటుంబీకులు, బంధువులు పెళ్లికి ఏర్పాట్లలో పడ్డారు. ఆ తర్వాత స్టోర్‌రూమ్‌లోకి వెళ్లిన రవళి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కుటుంబీకులతో పాటు బంధువులను షాక్ గురి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటాన స్థలానికి చేరుకొని రవళి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
రవళి ఆత్మహత్యకు గల కారణాలపై కూపీ లాగుతున్నారు. రవళి శనివారం రాత్రి చివరిసారిగా కాబేయే భర్తతో ఫోన్ మాట్లాడిందని, అతని వేధింపుల వల్లనే రవళి ఆత్మహత్య చేసుకుందని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రవళి తండ్రి పెళ్లి కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన తమ కూతురిని కన్యాదానం చేసి అత్తవారింటికి పడ్డామని, చివరకు పాడెపై కాటికి పంపాల్సి వస్తుందని అనుకోలేదంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంటి చావుడప్పు మోగడంతో గ్రామంలో విషాదం అలుముకున్నది.