తెలంగాణలో భారీగా IASల బదిలీలు?
విధాత: నాలుగేండ్లుగా ఎదురుచూస్తున్న ఐఏఎస్‌ల బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఎన్నికలకు ఏడాది ముందు సీఎం కేసీఆర్ పాలనా పరమైన ప్రక్షాళనరకు సన్నద్ధులయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేసీఆర్ తన ప్రాధాన్యతా క్రమంలో అధికారులను ఎంచుకొని పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉన్నది. ఎంతో కాలంగా పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్న వారు అధికార వర్గాల్లో పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఐఏఎస్‌ల్లో భారీ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. పరిస్థితులను బట్టి […]

విధాత: నాలుగేండ్లుగా ఎదురుచూస్తున్న ఐఏఎస్‌ల బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఎన్నికలకు ఏడాది ముందు సీఎం కేసీఆర్ పాలనా పరమైన ప్రక్షాళనరకు సన్నద్ధులయ్యారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేసీఆర్ తన ప్రాధాన్యతా క్రమంలో అధికారులను ఎంచుకొని పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉన్నది. ఎంతో కాలంగా పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్న వారు అధికార వర్గాల్లో పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఐఏఎస్‌ల్లో భారీ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. పరిస్థితులను బట్టి ఒక్కొక్కరికీ రెండు కన్నా ఎక్కువ శాఖల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మంచి అవకాశాలు కోసం ఎదురు చూస్తున్న కొందరు సీనియర్ ఐఏఎస్‌లు ఇదే అదనుగా తమదైన ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
నాలుగేళ్లుగా ఒకే పోస్టులో కొందరు ఐఏఎస్‌లున్నారు. అలాంటి వారంతా ఇప్పుడైనా తాము ఆశిస్తున్న పోస్ట్ చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. ఏ క్షణం ఐనా అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. బదిలీల తర్వాత కేసీఆర్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కొన్ని జిల్లాలకు ఇన్‌ఛార్జి కలెక్టర్లను నియమించనున్నారు.