ప్రతి గ్రామానికీ వైద్యం: CM KCR
వచ్చే ఏడాది 17 జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్ విధాత: మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తరహాలో ప్రతి గ్రామానికీ వైద్యం అందించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు అన్నారు. ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ ఎనిమిది నూతన వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులను మంగళవారం ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అనేక సమస్యలతో […]

- వచ్చే ఏడాది 17 జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు
- 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
విధాత: మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ తరహాలో ప్రతి గ్రామానికీ వైద్యం అందించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు అన్నారు. ప్రగతిభవన్ నుంచి సీఎం కేసీఆర్ ఎనిమిది నూతన వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులను మంగళవారం ఆన్‌లైన్‌లో ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అనేక సమస్యలతో ఎన్నో రకాల అవస్థలు పడిందన్నారు. ప్రత్యే క రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తరువాత వైద్య రంగంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు.
మహబూబాబాద్, వనపర్తి లాంటి ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు వస్తాయని ఎన్నడూ అనుకోలేదన్నారు. స్వరాష్ట్రం ఏర్పడింది కాబట్టే ఇవ్వాళ ఇన్ని మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. మంత్రి హరీష్ రావు తో పాటు వైద్య శాఖకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలిపారు.
కొత్తగా తరగతులు ప్రారంభించుకున్నఎనిమిది కాలేజీలతో కలిపి ప్రస్తుతం వైద్య కళాశాలలు 18కు పెరిగాయని, మరో 17 కాలేజీలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉందని చెప్పారు. వచ్చే ఏడాది వరకు మిగిలిన 17 జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుందామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
గతంతో పోల్చితే మూడు రేట్ల మెడికల్ సీట్ల కెపాసిటీ పెరిగిందన్నారు. మెడికల్, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా పెరిగాయని తెలిపారు. దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలకు ఇది మంచి అవకాశమన్నారు.
జనాభా ప్రాతిపదికన వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం పటిష్టంగా ఉందని ప్రకటించారు. ప్రతి జిల్లాకు వైద్యం అందేలా.. వైద్య రంగం అడుగులు వేస్తోందన్నారు. చిల్లర రాజకీయాలు చేయకుండా మిషన్ భగీరథ, కాకతీయ తరహాలో ప్రతీ గ్రామానికి వైద్యం అందాలన్నారు.
మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్‌లతో పాటు ప్రజా ప్రతినిధులు, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.