ఢిల్లీ లిక్కర్ స్కాం: MLC కవిత విచారణ..! ఇంకా ముగియలే.. ముందుంది ముసళ్ల పండుగ?
సాయంత్రం 6.30 వరకు కొనసాగిన విచారణ విచారణ ఇంతటితో ముగియలేదు.. ముందుంది ముసళ్ల పండుగ అన్న సీబీఐ విధాత: ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ అధికారుల విచారణ తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తతల మధ్య ముగిసింది. ఎమ్మెల్సీ కవితను ఏడున్నర గంటల పాటు విచారించిన అధికారులు ఇప్పటికైతే ఈ విచారణ ముగిసిందని చెప్తూ కొసమెరుపుగా అవసరమైతే మళ్లీ నోటిసులిచ్చి విచారణకు వస్తామని చెప్పారు. సీబీఐ అధికారులు వెళ్తూ వెళ్తూ.. అవసరమైతే మళ్లీ వస్తామన్నదే ఇక్కడ కీలకంగా భావించాల్సి ఉంటుంది. […]

- సాయంత్రం 6.30 వరకు కొనసాగిన విచారణ
- విచారణ ఇంతటితో ముగియలేదు..
- ముందుంది ముసళ్ల పండుగ అన్న సీబీఐ
విధాత: ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ అధికారుల విచారణ తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తతల మధ్య ముగిసింది. ఎమ్మెల్సీ కవితను ఏడున్నర గంటల పాటు విచారించిన అధికారులు ఇప్పటికైతే ఈ విచారణ ముగిసిందని చెప్తూ కొసమెరుపుగా అవసరమైతే మళ్లీ నోటిసులిచ్చి విచారణకు వస్తామని చెప్పారు. సీబీఐ అధికారులు వెళ్తూ వెళ్తూ.. అవసరమైతే మళ్లీ వస్తామన్నదే ఇక్కడ కీలకంగా భావించాల్సి ఉంటుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో ముందే చెప్పిన విధంగా ఈ రోజు ఉదయం 10.50 నిమిషాలకు కవిత ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు సాయంత్రం ఆరు గంటలు దాటినా ఇంటినుంచి బయటకు రాకపోవటంతో ఎమ్మెల్సీ కవిత ఇంటి పరిసర ప్రాంతంలోనూ, రాష్ట్రవ్యాప్తంగానూ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఒక మహిళను ఏకధాటిగా ఏడు గంటలకు పైగా విచారించటం ఏమిటి? అందునా సాయంత్రం ఆరు తర్వాత మహిళలను విచారించకూడదనే చట్ట నియమం ఉన్నది. అయినా సీబీఐ అధికారులు విచారణ కొనసాగించటం ఎలా న్యాయసమ్మతమని బీఆర్ ఎస్ శ్రేణులు ప్రశ్నించాయి.
ఏదో కుట్ర జరుగుతున్నదన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇలాంటి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య సరిగ్గా 6.30 గం.ల ప్రాంతంలో సీబీఐ అధికారులు కవిత ఇంటినుంచి బయటకు రావటంతో అంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కథ ఇక్కడితో ముగిసిపోలేదు. అసలు కథ ముందుంది అన్నట్టుగా.. సీబీఐ అధికారులు చివరగా చెప్పిన మాటలే అనేక అనుమానాలకు తావిస్తున్నాయి.
160 సీఆర్‌పీసీ కింద ఎమ్మెల్సీ కవితను సాక్షిగా ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకొనేందుకే వచ్చామని చెప్తున్న సీబీఐ అధికారుల మాటలు వాటికవిగా విశ్వసించదగినవేమీ కాదని గత అనుభవాలు చెప్తున్నాయి. గతంలో అనేక మందిని 160 నోటీస్‌తో స్టేట్‌మెంట్లు రికార్డు చేయటం అనేది అనేక దఫాలుగా చేసి చివరికి వారిని ముద్దాయిగా చేర్చిన ఉదంతాలున్నాయి. తాజాగా ఈ కేసులో కూడా కవిత వాంగ్మూలాన్ని నమోదు చేసిన సీబీఐ అధికారులు, ఇప్పటికైతే ముగిసిందని చెప్పటంలోనే మతలబు ఉందని అనుకోవాలి.
ఆ క్రంమలో జరిగేదేమంటే.. కవిత తన వాంగ్మూలంలో చెప్పిన విషయాన్ని.. తమ వద్ద ఉన్న సమాచారంతో సీబీఐ అధికారులు సరిపోల్చి చూసుకుంటారు. వారి దగ్గరున్న సమాచారంతో సరిపోలక పోతే మరొకసారి విచారణకు వస్తామని నోటీసులు పంపించ వచ్చు, విచారించ వచ్చు. ఇలాంటి తతంగం అనేక మార్లు జరిగి అనుమానస్పద ఆనవాళ్లు ఉన్నాయి, వాటికి తగిన నిర్దిష్ట సమాచారం కూడా తమ వద్ద ఉన్నదని సీబీఐ అధికారులు కవితను కూడా ముద్దాయిగా చేర్చడానికి, అరెస్టు చేయటానికి అవకాశం ఉన్నది.
మొదటి నుంచీ ఢిల్లీ మద్యం కుంభకోణం, అందులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత పేరు బయటకు రావటం అనేది.. రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఆ క్రమంలోనే అది ఒక రాజకీయ ప్రేరేపితమనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఈ కేసు దర్యాప్తు నేటితో ముగిసేది కాదని చెప్పకనే చెప్తున్నది. బీఆర్ ఎస్ వర్గాలే అంటున్నట్లు ఈ కేసు విచారణ వచ్చే సాధారణ ఎన్నకిల దాకా కొనసాగవచ్చు. రాజకీయ లబ్ధికోసం ఇరువైపులా వినియోగించుకోవచ్చుననే అభిప్రాయం రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేయటం గమనార్హం.