మునుగోడులో ఉద్రిక్తత: టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ
విధాత: నల్లగొండ జిల్లా మునుగోడు చౌరస్తాలో టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొన్నది. ప్రభుత్వం పంపిణీ చేసిన డబ్బులు వెనక్కి తీసుకోవడాన్ని నిరసిస్తూ బీజేపీ ధర్నా చేపట్టింది. కాగా అదే సమయంలో టీఆర్‌ఎస్ శ్రేణులు చౌటుప్పల్ నుంచి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రెండు పార్టీలు ఒకే చౌరస్తా నుంచి వెళ్లాల్సి ఉండడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నది. ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలు చేయడంతో పోలీసులు చెదరగొట్టారు. మునుగోడు చౌరస్తా వద్ద పోలీసులు భారీగా మోహరించగా […]

విధాత: నల్లగొండ జిల్లా మునుగోడు చౌరస్తాలో టీఆర్‌ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొన్నది. ప్రభుత్వం పంపిణీ చేసిన డబ్బులు వెనక్కి తీసుకోవడాన్ని నిరసిస్తూ బీజేపీ ధర్నా చేపట్టింది.
కాగా అదే సమయంలో టీఆర్‌ఎస్ శ్రేణులు చౌటుప్పల్ నుంచి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రెండు పార్టీలు ఒకే చౌరస్తా నుంచి వెళ్లాల్సి ఉండడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నది.
ఇరు వర్గాలు పోటాపోటీ నినాదాలు చేయడంతో పోలీసులు చెదరగొట్టారు. మునుగోడు చౌరస్తా వద్ద పోలీసులు భారీగా మోహరించగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మునుగోడులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వెళ్లారు.