షూటింగ్‌లో క‌ళ్లు తిరిగి ప‌డ్డ హీరో నాగ‌శౌర్య‌

విధాత: హైద‌రాబాద్‌లో ఒక సినిమాకు జ‌రుగుతున్న షూటింగ్‌లో పాల్గొన్న హీరో నాగ‌శౌర్య క‌ళ్లు తిరిగి కింద ప‌డిపోయాడు. దీంతో ఒక్క‌సారిగా షాక్‌కు గురైన యూనిట్ సిబ్బంది హుటా హుటిన గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రి వైద్యులు వెంట‌నే అత్య‌వ‌స‌ర చికిత్స చేశారు. హీరో నాగ‌శౌర్య డిహైడ్రేట్ కావడంతో షూటింగ్ లో కళ్ళు తిరిగి ప‌డిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. నాగ‌శౌర్య ఆరోగ్యం ప‌ట్ల ఎవ‌రూ ఆందోళ‌న ప‌డ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేద‌న్నారు. రేప‌టి వ‌ర‌కు నాగ‌శౌర్య త‌మ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో […]

షూటింగ్‌లో క‌ళ్లు తిరిగి ప‌డ్డ హీరో నాగ‌శౌర్య‌

విధాత: హైద‌రాబాద్‌లో ఒక సినిమాకు జ‌రుగుతున్న షూటింగ్‌లో పాల్గొన్న హీరో నాగ‌శౌర్య క‌ళ్లు తిరిగి కింద ప‌డిపోయాడు. దీంతో ఒక్క‌సారిగా షాక్‌కు గురైన యూనిట్ సిబ్బంది హుటా హుటిన గ‌చ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి త‌ర‌లించారు.

ఆసుప‌త్రి వైద్యులు వెంట‌నే అత్య‌వ‌స‌ర చికిత్స చేశారు. హీరో నాగ‌శౌర్య డిహైడ్రేట్ కావడంతో షూటింగ్ లో కళ్ళు తిరిగి ప‌డిపోయిన‌ట్లు వైద్యులు తెలిపారు. నాగ‌శౌర్య ఆరోగ్యం ప‌ట్ల ఎవ‌రూ ఆందోళ‌న ప‌డ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేద‌న్నారు.

రేప‌టి వ‌ర‌కు నాగ‌శౌర్య త‌మ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంటార‌ని, తిరిగి మంగ‌ళ‌వారం ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామ‌ని ఏఐజీ వైద్యులు తెలిపారు.