ఒక్కొక్క‌రికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ప‌డేసిన నాగార్జున‌.. యావ‌ర్ ఎవిక్ష‌న్ పాస్ బ్యాక్

ఒక్కొక్క‌రికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ప‌డేసిన నాగార్జున‌.. యావ‌ర్ ఎవిక్ష‌న్ పాస్ బ్యాక్

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్‏బాస్ సీజన్ 7.. ఇప్పటివరకు 10 వారాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 11వ వారం ఎలిమినేష‌న్‌కి ద‌గ్గ‌ర‌గా వ‌చ్చేసింది. ఈ వారం నామినేష‌న్‌లో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండ‌గా, వారిలో అమర్ దీప్, యావర్, అర్జున్, అశ్విని, ప్రియాంక, శోభా శెట్టి, రతిక, గౌతమ్ ల‌లో ఒక‌రు హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యారు. వీరిలో ఎవ‌రు వెళ‌తారా అనే సందేహం అంద‌రిలో ఉంది. ఇక శ‌నివారం ఎపిసోడ్‌లో నాగార్జున ఒక్కొక్క‌రికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ప‌డేశాడు.ముందుగా శుక్ర‌వారం రోజు ఏమెం జ‌రిగిందో చూపించిన నాగార్జున ఆ త‌ర్వాత సీసా తలమీద పగల కొట్టి తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయ‌ని అన్నారు.

ముందుగా కొత్త కెప్టెన్ ప్రియాంక‌పై ప్ర‌శంస‌ల జల్లు కురిపించారు. ఆ త‌ర్వాత శివాజీని నిలుచొమ‌ని ఆయ‌న ఫొటోపై సీసా ప‌గ‌ల‌గొట్టారు నాగ్. హౌస్ లో తరచుగా బూతులు మాట్లాడుతుండంతో నాగార్జున అత‌నికి వార్నింగ్ ఇచ్చారు. పిచ్చి పోహా, పిచ్చి నాయాల ఇలాంటి పదాలు ఇకపై వాడొద్దని అవి ప్రేక్ష‌కుల‌కి చాలా ఇబ్బందిగా ఉన్నాయ‌ని అన్నారు. అయితే ఆ ప‌దాలు స‌ర‌దా స‌మ‌యంలో వాడేవే త‌ప్ప సీరియ‌స్ సిట్యుయేష‌న్‌లో ఏనాడు అన‌లేద‌ని శివాజీ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసిన కూడా నాగ్ దానిని ఖండించాడు. అలానే శోభాతో గొడ‌వ గురించి డిస్క‌ష‌న్ పెట్టాడు. మొత్తానికి శనివారం ఎపిసోడ్‌లో శివాజి, నాగార్జున మ‌ధ్య ఎక్కువ డిస్క‌ష‌న్ న‌డిచింది అని చెప్పాలి.

కెప్టెన్సీ టాస్క్ లో అమర్ ఏడుస్తూ ఆడడం గురించి మాట్లాడుతూ.. అలా ఏడ‌వొద్దని గేమ్‌పై ఫోక‌స్ పెట్టాల‌ని సూచించారు నాగ్. ఇక రతికపై నాగార్జున కాస్త ఎక్కువగానే ఫైర్ అయ్యారు. అందరి ఫోటోలపై ఒక్కొక్క సీసా పగులగొట్టిన నాగ్.. రతిక ఫోటో పై మాత్రం మూడు సీసాలు పగలగొట్టి నువ్వు ఏం ఆడుతున్నావో కూడా తెలియ‌డం లేద‌ని అన్నాడు. ఇక యావ‌ర్‌ని నిలుచొమ‌ని చెప్పిన నాగార్జున‌ అత‌ను ఎవిక్ష‌న్ పాస్ టాస్క్‌లలో ఎలా ఆడాడో చూపించారు. యావర్ పూర్తిగా రూల్స్ బ్రేక్ చేసి ఆడినట్లు నాగార్జున వీడియో లో చూపించ‌డంతో, నేను తప్పుగా గేమ్ ఆడి ఉంటే తనకి ఈ ఎవిక్షన్ పాస్ అవసరం లేదని.. అందుకు తాను అర్హుడిని కాదని అది రిట‌ర్న్ ఇచ్చేశాడు. యావర్ ఎవిక్షన్ పాస్ కి అర్హుడా కాదా అని అడ‌డ‌గా.. ముగ్గురు మాత్రమే అర్హుడు కాదు అని చేతులు ఎత్తారు. మిగ‌తా వారంతా కూడా అతనికి స‌పోర్ట్‌గా ఉన్నారు. అయిన కూడా అది వెన‌క్కి ఇచ్చేశాడు. ఇక అశ్విని త‌ల‌పై ప్రియాంక సీసా ప‌గ‌ల‌గొట్టిన‌ప్పుడు ఆమె చేసిన ఓవ‌రాక్ష‌న్ గురించి కూడా నాగ్ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక ప్ర‌శాంత్‌తో ప‌లు క‌విత‌లు చెప్పించి చివ‌ర‌కు రతికపై ప్ర‌శాంత్ చెప్పిన కవితతో ఎపిసోడ్ సరదాగా ముగిసింది.