అందరి ముందు శ్రీలీలని ఓ రేంజ్‌లో పొగిడేసిన నితిన్.. ఆమెని చూస్తే నాకు సిగ్గేస్తుంది..!

శ్రీలీల.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకి ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చి ధమాకాతో తొలి హిట్ అందుకొని ఇప్పుడు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది ఈ అందాల ముద్దుగుమ్మ. రీసెంట్‌గా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో శ్రీలీల అదే జోష్‌తో పలు సినిమాలు చేస్తుంది. ఇప్పుడు ఏ హీరో సరసన చూసిన శ్రీలీలనే కనిపిస్తుంది.మల్టీ టాలెంటెడ్ అయిన శ్రీలీల వెనక అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఆమెతో కలిసి నటించేందుకు, డ్యాన్స్ చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపుతున్నారు. అంతేకాదు ఆమె గురించి ఓ రేంజ్‌లో పొగొడేస్తున్నారు.
ఇటీవల శ్రీలీల నితిన్‌తో కలిసి ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే చిత్రం చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 08న విడుదల కాగా, ఈ మూవీ ప్రేక్షకులని అంతగా అలరించలేకపోయింది. అయితే ఈ మూవీ ప్రమోషన్ సమయంలో నితిన్ శ్రీలీలని తెగ పొగుడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శ్రీలీల 20లో ఉంటే తాను నలభైలో ఉన్నానని, ఇద్దరి మధ్య ఎనర్జీ విషయంలో కొంత తేడా ఉంటుందని చెప్పిన నితిన్.. తన ఎనర్జీని మ్యాచ్ చేయడానికి చాలానే కష్టపడ్డట్టు చెప్పుకొచ్చాడు.శ్రీలీల నిజ జీవితంలో కూడా ఎక్స్‌ట్రార్డినరీ మహిళ అని, ఆమెకు భరతనాట్యం, కూచిపూడి తెలుసని, రాష్ట్రస్థాయిలో హాకీ ప్లేయర్ అని, స్విమ్మింగ్‌లోనూ రికార్డు ఉందని తెలియజేశారు.
ఇక శ్రీలీల త్వరలోనే మెడిసిన్ పూర్తిచేస్తుందంటూ కూడా చెప్పి ఆమె అభిమానులని ఫుల్ ఖుషీ చేశారు నితిన్. ఇక ఇటీవల గుంటూరు కారం ఈవెంట్‌లో మహేష్ బాబు కూడా శ్రీలీల డ్యాన్స్ పై ప్రశంసల జల్లు కురిపించడం మనం చూశాం. శ్రీలీలతో డ్యాన్స్ చేయాలంటే తాట లేచిపోతుంది అని కాస్త ఊరమాస్‌గా అన్నాడు. మొత్తానికి శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉంటూ వైవిధ్యమైన సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది.