Breaking: గ్రూప్‌-4 పోస్టుల భ‌ర్తీ.. ఆర్థిక శాఖ ఉత్త‌ర్వులు

త్వరలో నోటిఫికేషన్‌ అదనంగా 4 రకాల పోస్టులు.. పెరగనున్న పోస్టుల సంఖ్య విధాత‌: గ్రూప్-4 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 9,168 పోస్టుల భర్తీ కోసం అనుమతి ఇస్తూ శుక్ర‌వారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. Big announcement! 9,168 Group-IV vacancies be filled by Direct Recruitment through TSPSC#Telangana Govt under #CMKCR Garu, the leader […]

Breaking: గ్రూప్‌-4 పోస్టుల భ‌ర్తీ.. ఆర్థిక శాఖ ఉత్త‌ర్వులు
  • త్వరలో నోటిఫికేషన్‌
  • అదనంగా 4 రకాల పోస్టులు.. పెరగనున్న పోస్టుల సంఖ్య

విధాత‌: గ్రూప్-4 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 9,168 పోస్టుల భర్తీ కోసం అనుమతి ఇస్తూ శుక్ర‌వారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

గ్రూప్ -4 ఉద్యోగాల్లో ముఖ్యంగా మూడు కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 1862 వార్డ్ ఆఫీసర్ పోస్టులు, పంచాయతీ రాజ్ శాఖలో1,245 పోస్టులు, 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులతో పాటు రెవెన్యూ శాఖలో 2,077 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

గ్రూప్ -4లో ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ ఇతర తత్సమాన పోస్టులు ఉన్నాయి. వీటికి అదనంగా జువైనల్ విభాగం పరిధిలోని సూపర్ వైజర్ (పురుషులు), మాట్రన్ – స్టోర్ కీపర్ , సాంకేతిక విద్య కమిషనరేట్ లో మాట్రన్ పోస్టులతో కలిపి నాలుగు రకాల కేటగిరీ ఉద్యోగాలు వచ్చాయి.